తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు కలకాలం నిలిచిపోతుంది.. టాలీవుడ్ కి అయన ఓ దేవుడు లాంటి వారు.. అయన చేయని పాత్ర లేదు, చెప్పని డైలాగ్ లేదు.. సినిమాల్లో తనకు తానే సాటి. అయన గొప్ప నటుడు అని తోటి హీరోలే అంటుంటారు. గొప్ప నటుడే కాదు గొప్ప మనిషి కూడా.. ఆపద అంటూ ఎవరు వచ్చిన ఆడుకునేవారని అయన నుంచి సాయం పొందిన వారే చెప్తుంటారు. అందుకే అయన అంటే అందరికి అంత ప్రేమ…

నిజానికి ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉందని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి. శత్రువులు సైతం అయన ప్రేమకు కరిగిపోవాల్సిందే.. రాజకీయంగా, సినిమా పరంగా, వ్యక్తిగతంగా అన్ని వేదికలలోనూ మంచి ప్రేమను అందిపుచ్చుకున్నారు..అయన సహచర నటులు ఏఎన్నార్, కృష్ణం రాజు, కృష్ణ లు సైతం ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్తుంటారు. అభిమానులకంటే ఎక్కువగా ఎన్టీఆర్ ని కొలుస్తుంటారట వీరు.. ఇకపోతే శోభన్ బాబు తానున్న రోజుల్లో తన ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో ను పెట్టుకుని ఆరాధించేవారట.. కృష్ణంరాజు సైతం ఈ విషయాన్నీ చెప్పారు. అయితే ఎన్టీఆర్ పట్ల శోభన్ బాబు కు ఇంతకింత అమితమైన ప్రేమ అంటే..
చిత్ర పరిశ్రమలోకి వచ్చిన దగ్గరినుంచి శోభన్ బాబును ప్రోత్సహిస్తూ వచ్చారు ఎన్టీఆర్. తమ సొంత చిత్రం ‘సీతారామకళ్యాణం’లో లక్ష్మణుని పాత్రకు ఎంచుకున్నారు. తరువాత తన సొంత చిత్రాలతో పాటు, తాను హీరోగా నటించిన అనేక చిత్రాలలో శోభన్ బాబుకు ముఖ్యపాత్రలు వచ్చేలా చేశారు. అలా “భీష్మ, మహామంత్రి తిమ్మరుసు, లవకుశ, నర్తనశాల, కర్ణ, ప్రమీలార్జునీయం, శ్రీకృష్ణ పాండవీయం, పరమానందయ్య శిష్యుల కథ, శ్రీకృష్ణావతారం, నిండు హృదయాలు, మాతృదేవత, పెత్తందార్లు, మాయని మమత” వంటి యన్టీఆర్ చిత్రాలలో కీలక పాత్రలు శోభన్ బాబుకు వచ్చాయి.దాదాపు 12 సంవత్సరాలు అంటే 1959 నుండి 1971 వరకు యన్టీఆర్ సినిమాల్లో శోభన్ బాబు కీలక పాత్రలు పోషిస్తూనే గుర్తింపు సంపాదించారు. ఆ నాటి ఇతర హీరోలెవ్వరూ శోభన్ కు ఆ స్థాయిలో ఆదరువు చూపించని మాట వాస్తవం. అందువల్ల యన్టీఆర్ ను శోభన్ బాబు అంతలా అభిమానిస్తారని చెప్పవచ్చు.

































