నువ్వే కావాలి సినిమాతో న్యూ ఎంట్రీ ఇచ్చి రొమాంటిక్ హీరోయిన్ గాతెలుగు ప్రేక్షకుల గుండెల్లో కొలువుండి పోయిన రిచా పలోడ్ నేటికీ మీ అందరికీ గుర్తుండే వుంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తెలుగులో తొలి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రిచాకు ఆ తర్వాత ఆశించినంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి.

అయితే టాలీవుడ్ లో ఛాన్సులు రాకపోయినా బాలీవుడ్, తమిళ చిత్రాలలో మాత్రం వరుసగా అవకాశాలను దక్కించుకుంది. అంతా బాగుంది అనుకునేలోపు ఆ సినిమాలు కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో రిచా హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది. ఇంత మంచి నటికి అవకాశాలు ఎందుకు రాలేదా.? అని ఆరా తీస్తే.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే.. రిచా పల్లాడ్ కర్ణాటకలోని బెంగుళూరులో పుట్టి పెరగడం వలన సౌత్ ఇండియా భాషలైన తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది కానీ కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే ఓ బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మీకు తెలియనిదేముంది..

పెళ్ళైన తర్వాత రిచా మూటా, ముల్లె సర్దుకుని సినీరంగానికి దూరమై ప్రస్తుతం తన కుటుంబంతో హ్యాపీగా వుంది. రిచా పల్లాడ్ కి ఒక ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం రిచా పల్లాడ్ తన భర్తకు బిజినెస్ వ్యవహారాలలో సహాయపడుతూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటుంది. రిచా పల్లాడ్ తన సినీ కెరీర్ లో చివరిగా తెలుగులో ఆది పినిశెట్టి హీరోగా నటించిన “మలుపు” అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ రిచా సినిమాల్లో నటించలేదు. అదండి సంగతి.. రిచా మీకూ గుర్తొస్తే అర్జెంట్ గా నువ్వే కావాలి మూవీ చూసేయండి.




























