Why RRR team did not attend the Aliya marriage : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ కొన్ని ఏళ్లుగా ప్రేమించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏప్రిల్ 14న రణబీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో అతి కొద్దిమంది అతిథుల మధ్యలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం రణబీర్ ఆలియా ల పెళ్లి బాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా ఉంది. అయితే కొన్ని రోజులుగా వీరి మీద వస్తున్న రూమర్స్ కు ఈ జంట పెళ్లితో తెరదించారు.

అయితే ఇటీవల ఆలియా ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ కి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఇది ఎంతటి ఘన విజయం సాధించిందో కూడా తెలుసు, కానీ ఈమధ్య ఆలియా తన ఇన్స్టా నుంచి ఆర్ఆర్ఆర్ సంబంధించిన ఫోటోలు డిలీట్ చేయడం వంటివి చేయడం కారణంగా ఆలియా కు ఆర్ఆర్ఆర్ టీమ్ కీ ఎదో కోల్డ్ వార్ జరుగుతోందని, ఆలియా తన పాత్ర ను సినిమా లో తగ్గించినందుకు ఆలియా అలిగినట్టు వార్తలు వినిపిచ్చాయి. ఐతే ఇపుడు ఆర్ఆర్ఆర్ టీమ్ కు సంబంధించి ఎవరు ఆలియా రణబీర్ పెళ్లికి హాజరు కాకపోవడంతో ప్రస్తుతం అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ టీం ఆలియా రణబీర్ పెళ్లికి ఎందుకు హాజరు కాలేదు…
ఆలియా రణబీర్ ల పెళ్ళికి, తాజగా జరిగిన రిసెప్షన్ కు కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ హాజరు కాకపోవడం ఓక హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే వీళ్ళ మధ్య వ్యవహారం చెడిందా అన్న అనుమానాలు వస్తున్నాయ్. కానీ అదంతా అబద్దం అని ఆలియా సోషల్ మీడియా ద్వారా క్లియర్ చేసింది. కానీ మరోవైపు ఎన్టీఆర్ సినిమాకి నో చెప్పడంతో నిజంగానే వీళ్ళ మధ్య వ్యవహారం బాగోలేదన్న ఊహగానాలు కూడా వస్తున్నాయ్. అందుకే ఆలియా వీళ్ళని పెళ్ళికి పిలవలేదో లేక వీళ్ళే పెళ్ళికి రాలేదేమో అని అనుకుంటున్నారు.

కానీ వీరి వివాహానికి బాలీవుడ్ స్టార్స్ కూడా ఎవరు రాకపోవడం గమనర్హం. స్టార్స్ ఎవరిని పెళ్ళికి పిలవకుండా కుటుంబ సభ్యుల సమక్షం లో చేసుకున్నారు అన్న వాదన లేకపోలేదు. ఇక రిసెప్షన్ లో పలువురు స్టార్స్ సందడి చేసారు కానీ ఇక్కడ కూడా ఆర్ఆర్ఆర్ టీం లేకపోవడం నిజంగానే వీరి మధ్యలో చెడింది అనే వాదనకు మరింత బలం చేకూరినట్టయింది.































