మలయాళ భామ సాయి పల్లవి కి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. నిజానికి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకముందే ఆమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి కథానాయికగా లవ్ స్టోరీ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. శేఖర్ కమ్ముల చివరి చిత్రం ఫిదా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.. మరోవైపు నాగ చైతన్య కు ఇది చాలా ముఖ్యమైన సినిమా.. ఎందుకంటే అయన గత చిత్రాలు ఎంతో నిరాశ పరచగా ఈ సినిమా తో మళ్ళీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.

దాంతో ఈ సినిమా హిట్ ఎంతో ముఖ్యమైంది.. ఈ సినిమాలో సాయి పల్లవి హైలైట్ కానుంది. మలయాళం నుంచి ఒకటో రెండో సినిమాలు తెలుగులోకి రావడంతో పాటు ప్రేమమ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని చూసి సాయి పల్లవి కి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.. ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేశారు. అందరు అనుకున్నట్లే ఆమె తొలి సినిమా గా ఫిదా చేసింది.. ఆ సినిమాలో ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసి ఆకట్టుకుంది.. ఇదిలా ఉండగా సాయి పల్లవి సినిమాల సెలెక్షన్ విషయం లో చాలా క్లారిటీగా ఉంటుంది. తనకు స్టోరీ నచ్చితేనే సినిమాకు ఒకే చెపుతుంది. దాంతో చాలా సార్లు సాయి పల్లవి ఆ హీరోకు నో చెప్పింది.
ఈ హీరోకు నో చెప్పిందని వార్తల్లో నిలుస్తోంది. ఇక ఇటీవల మహేష్ బాబుకు సైతం సాయి పల్లవి నో చెప్పిందని వార్తలు వార్తలు వచ్చాయి. అనిల్ రావిపూడి సాయి పల్లవి కి ఓ కథ చెప్పారని కానీ సాయిపల్లవి ఆ కథలో నటించేందుకు నిరాకరించిందని పుకార్లు వచ్చాయి. అయితే తాజాగా ఓ సినిమా ప్రమోషన్ ఫంక్షన్ లో మాట్లాడిన అనిల్ రావిపూడి ఎప్పటికైనా తాను ఓ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తానని చెప్పారు. అంతే కాకుండా ఆ సినిమాలో సాయి పల్లవి నటించే అవకాశం ఉందని చెప్పాడు. దాంతో సాయి పల్లవి అసలు మహేష్ బాబు సినిమాకు నో చెప్పలేదని క్లారిటీ వచ్చేసింది. అంతే కాకుండా అనిల్ రావిపూడి సాయి పల్లవి తో తెరకెక్కించే సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని స్పష్టం అయ్యింది.



























