భారతీయ సంస్కృతిలో శంఖం ప్రాధాన్యత ఏమిటి?

0
111

సాధారణంగా శంఖం మనం ఎన్నో దేవాలయాలలో శంఖాన్ని పూజించడం చూస్తుంటాము. అలాగే దేవాలయాలలో తీర్థప్రసాదాలను శంఖ ద్వారా భక్తులకు సమర్పిస్తుంటారు.అదే విధంగా కొన్ని శుభకార్యాలకు ప్రతీకగా శంఖాన్ని ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మన సంస్కృతి సాంప్రదాయాలలో శంఖానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారో ఇక్కడ తెలుసుకుందాం…

శంఖం అనేది సర్వ సంపదలకు ప్రతీక.ఇంతటి పవిత్రమైన శంఖాన్ని పూజగది యందు ఉంచి పూజ చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అయితే శంఖం అమృతం కోసం దేవతలు, దానవులు సాగరమధనం చేస్తున్నప్పుడు సముద్రగర్భం నుంచి వెలువడిన పద నాలుగు రత్నాలలో శంఖం ఒకటని చెబుతారు. అదేవిధంగా విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి, శంఖం సముద్రుని సంతానమని, లక్ష్మికి సోదరి, సోదరుడుగా శంఖాన్ని భావిస్తారు.

శంఖం నుంచి వెలువడే ధ్వని విజయానికి, సమృద్ధికి, కీర్తి ప్రతిష్టలకు లక్ష్మీదేవి ఆగమనానికి ప్రతీకగా భావిస్తారు. ఇంతటి పవిత్రమైన శంఖాన్ని పూజగది యందు ఉంచుకొని పాలు, తేనె, నెయ్యి వంటి పదార్థాలతో అభిషేకం చేసి పూజించడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు. అంతేకాకుండా శంఖాన్ని పూజించడం వల్ల వాస్తు దోషాలు సైతం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అదే విధంగా శంఖాన్ని డబ్బులు దాచే బీరువాలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లేవారు పసుపు పచ్చని చిన్న గవ్వలను జేబులో వేసుకుని వెళ్లడం వల్ల అనుకున్న పని సక్రమంగా నెరవేరుతుందని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here