పెళ్లి అవ్వగానే అమ్మాయి ఇంటిపేరు మారుతుంది దీనికి అసలు కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా ? ఎందుకో ఇప్పుడు చూద్దాం రండి. సాధారణంగా ఒక కుటుంబంలో భర్త వయస్సులో పెద్దవాడు కాబట్టి ఆ ఇంటికి అతనే యాజమాని అవుతాడు. అయితే పెళ్లి తరువాత స్త్రీ ఇంటిపేరు మారడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గట్టి ఐక్యాతాభావం ఏర్పడుతుంది.

ముఖ్యంగా ఈ సాంప్రదాయం సమాజంలో స్త్రీ తన కుటుంబ పరువు, గౌరవ మర్యాదలు భుజాన మోస్తానని, వాటిని పెంచుతానని భాధ్యతలు స్వీకరించినట్లుగా చెబుతుంది. ఈ సాంప్రదాయము స్త్రీ యొక్క వైవాహిక స్థితిని చెప్పడమే కాకుండా సమాజంలో ఆ స్త్రీ ఏ కుటుంబానికి చెందినది.. ఎవరి భార్య అనే విషయాలను చెబుతుంది. భారతీయ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి ఈ సాంప్రదాయం ఒక కారణం.































