తన ఫోన్ తీసుకుందని భార్యపై కోర్టుకెక్కిన భర్త.. సంచలన తీర్పును ప్రకటించిన కోర్టు?

0
276

ప్రపంచంలో చాలా మంది భార్యలు తమ భర్త పట్ల ఒక డిటెక్టివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తుంటారు. భర్త హావభావాల నుంచి వారి ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తన భర్త లేనప్పుడు భార్య తన భర్త ఫోన్ చెక్ చేయడం, భర్త కాసేపు ఫోన్ లో నవ్వుతూ మాట్లాడినా భార్యకు ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. ఈ విధంగానే దుబాయ్ కి చెందిన ఓ మహిళ కూడా తన భర్త పట్ల డిటెక్టివ్ లా వ్యవహరించింది. అయితే ఆమె భర్త తనకు ఊహించని షాక్ ఇచ్చాడు.

దుబాయ్ కి చెందిన మహిళ తన భర్తపై నిఘా పెట్టింది. తన భర్తకు అనుమానం రాకుండా అతని ఫోన్ లో ప్రతి ఒక్క విషయాన్ని చెక్ చేసేది. ఈ క్రమంలోనే ఫోటోల నుంచి ఆడియో రికార్డింగ్స్ వరకు తన కుటుంబ సభ్యులకు చూపించి అతని విమర్శల పాలు చేసేది.దీంతో కుటుంబ సభ్యుల మధ్య తలెత్తుకోలేక భర్త కుమిలిపోయాడు.ఈ క్రమంలోనే తన ఫోన్ పై నిఘా పెట్టి తన ప్రైవసీకి ఎంతో భంగం కలిగించిన భార్యపై సదరు భర్త కోర్టులో పిటిషన్ వేశాడు.

తన భార్య చేసిన ఈ పని వల్ల తన ఆఫీసుకు కూడా వెళ్ళలేక పోతున్నానని, ఈ క్రమంలోనే లాయర్ కు చెల్లించాల్సిన ఫీజు కూడా తన భార్య చెల్లించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. తన భార్య చేసిన ఈ పని వల్ల తను మానసికంగా ఎంతో కుంగిపోయానని సదరు భర్త కోర్టుకు వివరించాడు.

ఈ క్రమంలోనే తన భర్త ఫోన్ నుంచి ఫోటోలు రికార్డింగులను సేకరించినట్లు ఆధారాలు ఉండడంతో తన భర్త ప్రైవసీకి భంగం కలిగిందని భావించిన కోర్టు తన భార్య పట్ల సంచలనమైన తీర్పు ప్రకటించింది.ఈ క్రమంలోనే తన భర్తను ఎంతో అవమానానికి గురి చేసిన భార్యకు లక్ష రూపాయలు జరిమానా విధించడంతో పాటు, భర్త తరపు న్యాయవాదికి భార్య ఫీజు చెల్లించాలని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలోనే మహిళా తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. అతడు ఆమెను తీవ్రంగా తిట్టడమే కాకుండా అతను ఇంటి నుంచి బయటకు పంపాడని తెలపడంతో న్యాయస్థానం దీనికి తగ్గ సరైన ఆధారాలతో కోర్టుకు రావాలని పేర్కొన్నారు. మహిళలు ఇప్పటినుంచి మీ భర్తల ఫోన్లో పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించండి.. లేదంటే మీరు కూడా జరిమానా కట్టాల్సి ఉంటుంది.