Featured

బంగార్రాజుగా హిట్ కొడతారా.. తండ్రీ, కొడుకుల హ్యాట్రిక్ నిలిచేనా..?

అక్కినేని వారసత్వం నుంచి వచ్చిన నాగచైతన్య .. సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నాడు. తాత నాగేశ్వర్ రావు, తండ్రి నాగార్జున వారసత్వం నుంచి మూడో తరం హీరోగా సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటి వరకు ఇది నాగచైతన్య సినిమా అన్న రేంజ్ లో హిట్ సాధించలేదు. అయితే మధ్యమధ్యలో హిట్లు ఇచ్చినా.. బ్లాక్ బస్టర్ రేంజ్ హిట్ పడలేదు. దీనికి తోడు సమంతతో విడాకుల వ్యవహారంలో నాగ చైతన్య వార్తల్లో నిలిచారు. 

ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమా చేస్తున్నారు నాగచైతన్య. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు నాగార్జున తో కలిసి రెండు సినిమాలు  చేసిన నాగచైతన్యకు.. బంగార్రాజు మూడో చిత్రం. ఇంతకు ముందు  2014లో మనం సినిమాలో నటించాడు. తాత నాగేశ్వర్ రావు, తండ్రి నాగార్జునతో పాటు తమ్ముడు అఖిల్ తో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

విక్రమ్ కే. కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం సినిమా విజయాన్ని నమోదు చేసింది. ఈసినిమాలో నాగార్జునకు తండ్రిగా కనిపించారు నాగచైతన్య. దీని తర్వాత ప్రేమమ్ సినిమాలో మరోసారి నాగార్జునతో కలిసి నటించారు. ఈ సినిమాలో నాగచైతన్యకు తండ్రిగా నాగార్జున నటించారు.

అయితే ఈసినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాలేదు. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బంగార్రాజు సినిమాలో నాగార్జునకు మనువడిగా నాగచైతన్య నటిస్తున్నారు. బంగార్రాజు సినిమాలో నాగార్జునకు జోడిగా సీనియర్ యాక్టర్ రమ్యక్రిష్ణ నటించగా… నాగచైతన్యకు జోడీగా యంగ్ క్రష్ కృతి శెట్టి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల లడ్డూ నెయ్యి టెండర్లపై రాజకీయ రగడ.. వైసీపీ ఆరోపణలు.. అసలు నిజం ఏంటి? టీటీడీ క్లారిటీ ఇదే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఆరాధించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం లడ్డూ నాణ్యత…

1 minute ago

ఏపీలో భారీ వర్షాలా? బంగాళాఖాతం నుంచి వరుస అల్పపీడనాలు!ఈ జిల్లాలకు అలర్ట్ జారీ..!

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి వేడి క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా ఎగబాకుతున్నాయి. ఇలాంటి సమయంలో…

4 minutes ago

శంఖం పువ్వులే కాదు… కాయలూ ఆరోగ్యానికి మేలు చేస్తాయా?

ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పాతకాలం నుంచి వాడుతున్న మొక్కలు, వనమూలికలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అలాంటి వాటిలో…

9 minutes ago

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

12 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

13 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

14 hours ago