అక్కినేని వారసత్వం నుంచి వచ్చిన నాగచైతన్య .. సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నాడు. తాత నాగేశ్వర్ రావు, తండ్రి నాగార్జున వారసత్వం నుంచి మూడో తరం హీరోగా సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటి వరకు ఇది నాగచైతన్య సినిమా అన్న రేంజ్ లో హిట్ సాధించలేదు. అయితే మధ్యమధ్యలో హిట్లు ఇచ్చినా.. బ్లాక్ బస్టర్ రేంజ్ హిట్ పడలేదు. దీనికి తోడు సమంతతో విడాకుల వ్యవహారంలో నాగ చైతన్య వార్తల్లో నిలిచారు.

ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమా చేస్తున్నారు నాగచైతన్య. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు నాగార్జున తో కలిసి రెండు సినిమాలు చేసిన నాగచైతన్యకు.. బంగార్రాజు మూడో చిత్రం. ఇంతకు ముందు 2014లో మనం సినిమాలో నటించాడు. తాత నాగేశ్వర్ రావు, తండ్రి నాగార్జునతో పాటు తమ్ముడు అఖిల్ తో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
విక్రమ్ కే. కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం సినిమా విజయాన్ని నమోదు చేసింది. ఈసినిమాలో నాగార్జునకు తండ్రిగా కనిపించారు నాగచైతన్య. దీని తర్వాత ప్రేమమ్ సినిమాలో మరోసారి నాగార్జునతో కలిసి నటించారు. ఈ సినిమాలో నాగచైతన్యకు తండ్రిగా నాగార్జున నటించారు.
అయితే ఈసినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాలేదు. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బంగార్రాజు సినిమాలో నాగార్జునకు మనువడిగా నాగచైతన్య నటిస్తున్నారు. బంగార్రాజు సినిమాలో నాగార్జునకు జోడిగా సీనియర్ యాక్టర్ రమ్యక్రిష్ణ నటించగా… నాగచైతన్యకు జోడీగా యంగ్ క్రష్ కృతి శెట్టి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.































