హత్యలు, అత్యాచారాలు దేశంలో ప్రతీ రోజు ఏక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఇలా జరకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఈ కామాంధులు వినడం లేదు. ఎంత కఠినంగా శిక్షలు విధించినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి యూపీలో చోటుచేసుకుంది. మహిళ ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఆ సమయంలో ప్రియుడితో ఉండగా.. మరో మహిళ చూసింది. దీంతో ఇద్దరు కలిసి ఆమెను గొంతుకోసి హత్య చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మీరట్ జిల్లా పస్వాడా గ్రామాని చెందిన ఓ మహిళ .. తన ప్రియుడు కలిసి ఓ అటవి ప్రాంతంలో ఉన్నారు. ఆ పనిలో ఉండగా అదే గ్రామానికి చెందిన మరో మహిళ లక్ష్మినీ (45) చూసింది. ఈ విషయం బయట చెబితే ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఇద్దరు కలిసి ఆమె గొంతు కోసి హత్య చేశారు.
అక్కడ నుంచి వాళ్లు పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ శవాన్ని పోస్టమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్ధలంలో నిందితులకు సంబంధించిన చెప్పులు, వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతుండగా.. తాజాగా దొరికిన ఆధారాల ప్రకారం పోలీస్ డాగ్ నిందితుల ఆనవాళ్లను పసిగట్టింది.
ఆ డాగ్ గ్రామంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. అక్కడ ఓ మహిళ ఉంది. పోలీసులు ఆమెను ప్రశ్నించగా నిజం జరిగిన తతంగం మొత్తం చెప్పేసింది. తమ మధ్య ఆ బంధం గురించి ఎవరికైనా చెబుతుందనే భయంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ వివరాలన్నీ వెల్లడించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.



























