Writer and Director BVS Ravi : మోహన్ బాబు గారితో నాకేమి విబేధాలు లేవు… బ్రాహ్మణుల విషయంలో ముందే హెచ్చరించాను… ప్రభాస్ ను కాదని గోపీచంద్ తో సినిమా చేయడానికి కారణం…: రైటర్ మరియు డైరెక్టర్ బివిఎస్ రవి

0
22

Writer And Director BVS Ravi : రైటర్ గానూ అటు డైరెక్టర్ గానూ మంచి గుర్తింపు అందుకున్న మచ్చ రవి అసలు పేరు బాచు మంచి వెంకట సుబ్రహ్మణ్యం రవి కాగా బివీఎస్ రవి, మచ్చ రవిగా బాగా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. నిజానికి తాజాగా ఆహా లో వస్తున్న అన్ స్టాపబుల్ తో మరింత క్రేజ్ సంపాదించుకున్న రవి మొదట రైటర్ గా పోసాని గారి వద్ద పనిచేసి పోసాని రైటర్ గా చేసిన సినిమాలకు సహాయం చేసారు. అయోధ్య రామయ్య, భద్రాచలం, సీతా రామరాజు, సీతయ్య వంటి సినమాలకు పోసాని అసిస్టెంట్ గా పనిచేసారు రవి. గోపీచంద్ హీరోగా వచ్చిన వాంటెడ్ సినిమాతో డైరెక్టర్ అయిన రవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడారు.

దేనికైనా రెడీ సినిమా అప్పుడు ముందే చెప్పాను…

విష్ణు హీరోగా వచ్చిన దేనికైనా రెడీ సినిమా నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. సినిమా పూర్తయ్యాక కథ అందించిన మచ్చ రవి అందులో కొన్ని డైలాగలను మార్చమని చెప్పారట. అసలే మనం మనోభావాల ట్రెండ్ లో ఉన్నాం వద్దండి అంటే మీ కమ్యూనిటీ అని అంటున్నావా అన్నారు. కామెడీ గానే కాదా చేస్తున్నాం అంతే కదా అన్నారు. అదుర్స్ సినిమా సమయంలో కూడా ఇలానే జరిగినపుడు కోన వెంకట్ గారు ఆ సంఘాల వాళ్ళతో మాట్లాడి పరిష్కరించారు.

కాని ఇక్కడ అలాంటి ప్రయత్నం జరగలేదు. గొడవ పెద్దది అయి ఏకంగా కోర్టు వరకు వెళ్ళింది. మోహన్ బాబు గారితో నాకెలాంటి విబేధాలు లేవు ఇప్పటికీ విష్ణు, లక్ష్మి లను కలుస్తుంటాను. జిన్నా సినిమా కూడా మొదట నేను కోన వెంకట్ వెళ్లి ప్రాజెక్ట్ చేసాం కానీ మధ్యలో మారిపోయింది అంటూ చెప్పారు మచ్చ రవి. ఇక తన వాంటెడ్ సినిమా సమయంలో కథ మొదట ప్రభాస్ కి చెప్పగా ఆయన కొన్ని మార్పులు చెప్పారు. అప్పటికే సినిమా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న నేను మళ్ళీ గోపీచంద్ తో సినిమా చేశాను, ఆ సినిమా సమయంలో పూరీ జగన్నాథ్ నాకు బాగా హెల్ప్ చేసారు అంటూ చెప్పారు రవి.