Writer and Director BVS Ravi : వీడు స్టూడెంట్ ఏంటి అని నాగార్జున సుమంత్ ని అన్నారు… దాంతో ప్లాన్ మార్చాం… ఆర్జీవి, రవితేజ నన్ను డ్రైవర్ గా మార్చారు…: బివిఎస్ రవి

0
19

Writer and Director BVS Ravi : రైటర్ గానూ అటు డైరెక్టర్ గానూ మంచి గుర్తింపు అందుకున్న మచ్చ రవి అసలు పేరు బాచు మంచి వెంకట సుబ్రహ్మణ్యం రవి కాగా బివీఎస్ రవి, మచ్చ రవిగా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యారు. నిజానికి తాజాగా ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ తో మరింత క్రేజ్ సంపాదించుకున్న రవి మొదట రైటర్ గా పోసాని గారి వద్ద పనిచేసి పోసాని రైటర్ గా చేసిన సినిమాలకు సహాయం చేసారు. అయోధ్య రామయ్య, భద్రాచలం, సీతా రామరాజు, సీతయ్య వంటి సినమాలకు పోసాని అసిస్టెంట్ గా పనిచేసారు రవి. ఇక గోపీచంద్ హీరోగా వచ్చిన వాంటెడ్ సినిమాతో డైరెక్టర్ అయిన రవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడారు.

సత్యం సినిమాకు పనిచేసే అవకాశం…

సుప్రియ గారి వద్ద మొదటి నుండి స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తూ ఉండే మచ్చ రవి గారికి ఆమె ఎంతో ప్రోత్సాహం ఇచ్చారట. అలాగే హీరో సుమంత్ కూడా ఎంతో ఎంకరేజ్ చేసేవారని తెలిపారు బివీఎస్ రవి. ఇక అలా రెండేళ్ల పాటు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని వెళితే సుమంత్ గారికి సుప్రియ గారికి స్టోరీ నచ్చి నాగార్జున గారికి స్టోరీ వినిపించమని చెప్పారు. అలా నాగార్జున గారి వద్దకు వెళితే కథ విని సుమంత్ స్టూడెంట్ ఏంటి కథ మార్చు అన్నారు. అదే సమయంలో సూర్య కిరణ్ చెప్పిన స్టోరీ కి మార్పులు చెప్పి ఇద్దరినీ కలిసి స్క్రిప్ట్ చేయమన్నారు. అలా ‘సత్యం’ స్టోరీ కి ట్రై చేసాం అంటూ చెప్పారు.

ఇక 2007 సమయంలో గుండె పోటు రావడంతో హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకున్నాను. ఇక తాగడం అలవాటు ఉన్నా చాలా తక్కువే అంటూ చెప్పారు. రెండు సార్లు డ్రంక్ డ్రైవ్ లో దొరకడం గురించి మాట్లాడుతూ ఒకే ఏడాది నాలుగు నెలలు గ్యాప్ లో దొరికాను, అది కూడా తాగి కాదు నేను ఒక ఆయుర్వేద్ద మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆల్కహాల్ శాతం చూపిస్తుంది. ఇక మరోసారి కొంచం తాగాను అది తెలియకూడదని బ్లూ బెర్రీ మౌత్ ఫ్రెషనర్ వాడటం అందులో ఆల్కహాల్ ఉండటం వల్ల దొరికాను. ఆ రెండు సందర్భాలలోనూ రవితేజ, అర్జీవీ ఉండటం వల్ల హైలైట్ అయింది అంటూ చెప్పారు. రౌడీ సినిమా అలాగే ఆగడు సినిమా వేడుకలప్పుడు ఆ ఇష్యూస్ జరిగాయి అంటూ చెప్పారు.