Writer and Director Kanagala Jayakumar : సీన్ చెప్పడానికి హీరోయిన్ జయప్రద దగ్గరికి మేకప్ రూమ్ కి వెళ్లగా… డైరెక్టర్ తో ఏం చేస్తోందంటే…: రైటర్ మరియు డైరెక్టర్ కనగాల జయకుమార్

0
183

Writer and Director kanagala Jayakumar : చీరకట్టు పెద్ద బొట్టులో నిండు తెలుగుదనంతో ఉండే హీరోయిన్ అనగానే అప్పటి హీరోయిన్ జయప్రద గుర్తొస్తుంది. రాజమండ్రికి చెందిన జయప్రద 70లలో సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఉంటూ అందరు అగ్రహీరోలతోను సినిమాలను చేసింది. ఇక ఒక్క తెలుగులోనే కాకుండా ఇటు సౌత్ అన్ని భాషలలోనూ నటించిన జయప్రద అటు హిందీలోనూ అగహీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఉత్తరాదిన హిందీ మాత్రమే కాకుండా మరాఠి వంటి భాషల్లో కూడా నటించింది జయప్రద. ఇక ఆమె గురించి ఇంట్రస్టింగ్ విషయాలను రైటర్ మరియు డైరెక్టర్ కనగాల జయకుమార్ తెలిపారు.

డైరెక్టర్ రూమ్ లో జయప్రద…

కే విశ్వనాధ్ గారి సినిమా ‘సిరి సిరి మువ్వ’లో హీరోయిన్ గా చేసే సమయంలో జరిగిన సంఘటన ను కనగాల జయకుమార్ వివరించారు. ఆ సినిమాలో ఒక సీన్ అర్థం కాకపోవడంతో అసిస్టెంట్ గా ఉన్న జయకుమార్ గారు డైరెక్టర్ ను కలవడానికి వెళితే హీరోయిన్ మేకప్ రూమ్ లో ఆయన ఒక మంచం మీద పడుకుని ఉన్నారట. ఆయన షూటింగ్ గ్యాప్ లో నిద్రపోవడం అలవాటు అంటూ చెప్పిన జయకుమార్ గారు ఆయనని నిద్ర లేపడం ఇష్టం లేక అక్కడే కూర్చొని సీన్ చదువుకుంటుండగా అక్కడే మేకప్ వేసుకుంటున్న జయప్రద వచ్చి పక్కన కూర్చుందట.

ఆమె పక్కనే కూర్చోవడంతో కాస్త జరిగి కూర్చున్న జయకుమార్ అయితే ఆమె మళ్ళీ జరిగి ఆయన పక్కనే కూర్చుందట. సీన్ చదువుతున్నారా అంటూ మాట్లాడించారట. ఇక జయప్రద పక్కన నేను కూర్చోవడం చూస్తే డైరెక్టర్ కోప్పాడుతారని భయమేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను అంటూ జయకుమార్ తెలిపారు. ఇక ఒక పాట షూటింగ్ జరుగుతుండగా విశ్వనాధ్ గారు ఆమెకు ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలో వివరిస్తుంటే జయప్రద అలానే చూస్తూ ఉండిపోయారు. వెంటనే విశ్వనాధ్ గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ అరిచే సరికి తేరుకున్నారు అంటూ జయకుమార్ అప్పటి విషయాలను పంచుకున్నారు.