Writer & Director Dasarath : సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటరటైనర్స్ ను అందించిన డైరెక్టర్ అలాగే రచయిత అయిన దశరథ్ గారు ప్రస్తుతం డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. గోపీచంద్ హీరోగా వచ్చిన శౌర్యం సినిమా తరువాత ఆయన సినిమాలను చేయలేదు. మనసుకు తృప్తి కలుగకపోతే ఆ పని చేయలేమని చెప్పే దశరథ్ గారు బ్లాక్ బస్టర్ సినిమా నువ్వునేను కి రచయిత గా పనిచేసారు. ఇక అయన బాల్యం నుండి అనేక కష్టాలను పడ్డానంటూ తన వ్యక్తిగత జీవితం గురించి దశరథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

జీవితంలో ఎన్నో బాధలను భరించాను…
కొండపల్లి దశరథ్ కుమార్ గారి స్వస్థలం ఖమ్మం కాగా నాన్నగారికి ఎన్నో వందల ఎకరాల భూములు ఉన్నా అవన్నీ ప్రభుత్వం అటవీ భూమి కిందకు చేర్చడంతో పోయి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారట. బాల్యంలోనే ఒకవైపు షాప్స్ లో పనికి వెళుతూ మరోవైపు చదువుకున్న దశరథ్ గారు అప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

వాటి ముందు సినిమా అవకాశాల కోసం పడినవి కష్టాలుగా కనిపించలేదని చెప్పారు. ఇప్పుడు ఆర్ధికంగా బాగున్నా ఎక్కడికైనా కుటుంబంతో కలిసి బయటికి వెళ్ళినపుడు మా అమ్మ నాన్న ఉండి ఉంటే అన్న ఆలోచన బాగా బాధిస్తుందని తెలిపారు. తల్లి పదవ తరగతి చదివే సమయంలోనే పోగా తండ్రి సంతోషం సినిమా సమయంలో చనిపోయారని ఎమోషనల్ అయ్యారు.


































