Writer& Director Kanagala Jayakumar: పాత సినిమా విశేషాలను అప్పటి షూటింగ్ సంగతులను యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఇంటర్వ్యూలలో పంచుకుంటున్నారు రైటర్ మరియు డైరెక్టర్ కనగాల జయకుమార్. తాజాగా రచయిత మోదుకూరి జాన్సన్ గురించి ఆయన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. మోదుకూరి జాన్సన్ గారు రచయితగా విచిత్ర దాంపత్యం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై అనతి కాలంలోనే రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.

కృష్ణ గారి సినిమాకోసం విశ్వనాథ్ సినిమా వదిలేసాడు…
కే విశ్వనాధ్ గారి వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా జయకుమార్ గారు పనిచేస్తున్న సమయంలో ‘నేరం శిక్ష’ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కోసం రైటర్ గా మోదుకూరి జాన్సన్ గారిని తీసుకోగా ఆయన సగం సినిమాకు డైలాగకు రాసారు. అప్పటికే ఆ డైలాగులు షూటింగ్ లో బాగా పేలుతున్నాయి. అందరూ వాటిని ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఆయన కృష్ణ గారు ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా తీయబోతుంటే జాన్సన్ గారిని డైలాగులు రాయమని అడిగే సరికి ఆయన కే విశ్వనాధ్ గారి సినిమా వదిలేసి కృష్ణ గారి సినిమా కోసం వెళ్లిపోయారు. సగం సినిమా అయ్యాక ఆలా చేయడంతో మరో రైటర్ కోసం వెతుకగా సగం సినిమాకు రాయాలని ఎవరూ అనుకోలేదు. చివరకు జూనియర్ సముద్రల గారు మిగిలిన భాగం సినిమాకు డైలాగులు రాసారు అంటూ జయకుమర్ తెలిపారు.


































