Writer & director Kanagala Jayakumar : నెల్లూరుకి చెందిన రత్నకుమారిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగి కలాభినేత్రిగా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు వాణిశ్రీ. సావిత్రి గారి తరువాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ. తెలుగు కన్నడ, తమిళం ఇలా అన్ని భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన వాణిశ్రీ గారు పెళ్లయ్యాక నటనకు దూరమై మళ్ళీ రీఎంట్రీలో అత్త పాత్రలో మెప్పించింది. ఇక ఆమె చిన్నతనం గురించి ఆమె కుటుంబం గురించి రచయిత అలాగే దర్శకుడు అయిన కనగాల జయకుమార్ వివరించారు.

వాణిశ్రీ ఇంట్లో ఒకేరోజు మూడు మరణాలు…
వాణిశ్రీ గారిది నెల్లూరు కాగా చిన్నతనములోనే తండ్రి టీబి వ్యాధితో మరణించారు. అదే రోజు తన ఇద్దరు అక్కలు కూడా టీబి బారిన పడి మరణించడంతో క్రుంగిపోయింది ఆ కుటుంబం. వాణిశ్రీ తల్లి ఆమె వాణిశ్రీ దృష్టిని మరల్చదానికి చెన్నై తీసుకెళ్లి అక్కడ గేదెలను పెట్టుకుని పాల వ్యాపారం చేసారు. అలానే వాణిశ్రీ గారికి చదువుతో పాటు భరత నాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఇక నాటక రంగ ప్రవేశం కూడా చేసిన వాణిశ్రీ గారు నాటకాలతో ప్రసిద్ధి చెందారు. ఆమె నటన చూసిన కొందరు దర్శక నిర్మాతలు సావిత్రి లాంటి అభినయం కనబడుతోందని ఆమెకు చిన్న చిన్న వేషాలను సినిమాల్లో ఇవ్వడం ప్రారంభించారని జయకుమార్ తెలిపారు.

ఇక ఆలా మొదలయిన ఆమె ప్రస్థానంలో దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, గంగ మంగ, కృష్ణవేణి వంటి మరుపు రాని చిత్రాలు ఉన్నాయి. కొన్ని సినిమాల్లో ఆమె గడుసు తనంతో ఉన్న పాత్రలు చేయడం వల్ల నిజంగా కూడా ఆమె గర్విష్టి అనే ప్రచారం ఉండేది కానీ ఆమె చాలా బాగా అందరినీ గౌరవిస్తారు అంటూ చెప్పారు. తాను పుట్టిన ఊరి కోసం ఆమె స్కూల్ అలాగే హాస్పిటల్ కట్టించారు అంటూ చెప్పారు.

































