Connect with us

Featured

Writer Kanagala Jayakumar : ఏఎన్ఆర్ గారికి ఇంగ్లీష్ రాదు… ఎన్టీఆర్ ను తట్టుకోలేక చెన్నై నుండి హైదరాబాద్ వచ్చేసారు…: రైటర్ కనగాల జయకుమార్

Published

on

Writer Kanagala Jayakumar : తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, సావిత్రి ముందుంటారు, ఇక మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లంటే తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళవంటి వారు. ఒకరు జానపదం, పౌరాణికంకి రారాజు అయితే మరొకరు సాంఘిక, కుటుంబ కథాచిత్రాల రారాజు. పౌరాణికాల్లో తనకు పోటీ ఎవరూ లేరని ఎన్టీఆర్ ముద్ర వేసుకుంటే, ప్రేమికుడి పాత్రలో తనకు సాటి లేరని నాగేశ్వరావు నిరూపించుకున్నారు. ఇద్దరూ అప్పట్లో పోటీపడి నటించేవారు. ఇద్దరి సినిమాలకు గట్టి పోటీ ఉండేది. అయితే ఒకానొక సందర్భంలో నాగేశ్వర్రావు గారు ఎన్టీఆర్ గారి పోటీని తట్టుకోలేక చెన్నై వదిలి హైదరాబాద్ వచ్చేసారంటూ రైటర్ కనగాల జయకుమార్ తెలిపారు.

నాగేశ్వర్రావు గారికి ఆంగ్లం రాదు… బాగా ఇబ్బంది పడ్డారు…

జయకుమార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా అలాగే రైటర్ గా పనిచేస్తున్న సమయంలో నాగేశ్వర్రావు గారి గోపాలకృష్ణుడు సినిమాకు పనిచేసే అవకాశం వచ్చిందని తెలిపారు. ఆ సమయంలోనే ఆయనను చాలా దగ్గరగా గమనించే అవకాశం లభించిందని, అందరూ పుస్తకాలను చదివి జ్ఞానం తెచ్చుకుంటే నాగేశ్వరావు గారు మాత్రం జీవితమనే పుస్తకం నేర్పించిన పాఠాలను నేర్చుకున్నారు. ఆయన చదువుకోక పోయినా ఆంగ్లం అనర్గలంగా మాట్లాడగలరు. మొదట్లో ఆయన ఎన్ఆర్ఐ అభిమానుల కోసం అమెరికా వెళ్లి ప్రసంగించాల్సిన సందర్భంలో మొదట్లో ఇబ్బంది ఎదుర్కొన్నా ఆపైన ఇంగ్లిష్ లో బాగా మాట్లాడటం నేర్చుకున్నారు.

Advertisement
NTR -ANR: ఎన్టీఆర్ కారణంగా ఏఎన్ఆర్ ఆ పాత్రకు దూరమయ్యారా.. అందుకే ఆ వేషం వెయ్యలేదా?

ఇక 70 దశకంలో ఎన్టీఆర్ గారు కమర్షియల్, మాస్ హీరోగా ఎదిగిన క్రమంలో నాగేశ్వరావు గారు ఆయన నుండి పోటీ ఎదుర్కొనలేక, ఇక అప్పట్లో విజయ సంస్థకు పర్మినెంట్ హీరోగా ఎన్టీఆర్ ఉండటంతో ఏఎన్ఆర్ గారు తనకంటూ నిర్మాణ సంస్థలు ఉండాలని భావించి కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండే ఆయన ఆ సమయంలోనే ఎన్టీఆర్ తో పోటీ పడలేక హైదరాబాద్ వచ్చేయాలని భావించి వచ్చేసారు. హైదరాబాద్ ల్ సారథి స్టూడియోస్ తో గొడవ కారణంగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు అంటూ జయకుమార్ గారు వివరించారు.

Continue Reading
Advertisement

Featured

Chiranjeevi: వామ్మో చిరంజీవి కట్టుకున్న వాచ్ ధర అన్ని లక్షలా.. చూడటానికి సింపుల్ గానే ఉందే!

Published

on

Chiranjeevi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు వస్తువులన్నీ కూడా చాలా ఖరీదైనవి అయ్యి ఉంటాయి. వాళ్లు వేసుకుని షూ నుంచి మొదలుకొని తిరిగే కార్లు ఉండే ఇల్లు వరకు చాలా ఖరీదైనవే ఉంటాయి. ఇక సెలబ్రిటీలు ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు స్పెషల్ గా కనిపిస్తే వారి చెప్పుల నుంచి మొదలుకొని డ్రెస్ వాచ్ ధరల గురించి పెద్ద ఎత్తున అభిమానులు సెర్చ్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి వాచ్ గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. ఈ వేడుకకు చిరంజీవి చాలా సింపుల్ లుక్ లో కనిపించారు.

ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవి చాలా సింపుల్ గా వచ్చినప్పటికీ ఈయన చేతి వాచ్ మాత్రం అందరిని ఆకర్షించింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేతికి కట్టుకున్నటువంటి వాచ్ ఖరీదు ఎంత అసలు అది ఏ బ్రాండ్ కు సంబంధించినది అనే విషయాల గురించి అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

Advertisement

అరకోటి రూపాయలు..
ఈ కార్యక్రమంలో చిరంజీవి చేతికి కట్టుకున్నటువంటి వాచ్ ఏ లాంజ్ అండ్ స్నోహే అనే బ్రిటిష్ కంపెనీకి సంబంధించినటువంటి వాచ్ ధరించారు అయితే ఈ వాచ్ ధర ఏకంగా 50,56,747 రూపాయలు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాదాపు అరకోటి రూపాయలు ఖర్చు చేసి ఈ వాచ్ ను కొనుగోలు చేశారనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక సామాన్య ప్రజలకు ఇది చాలా పెద్ద విషయమైనప్పటికీ సెలెబ్రెటీలకు మాత్రం ఇది చాలా సింపుల్ విషయాలు అని చెప్పాలి.

Advertisement
Continue Reading

Featured

Varun Tej: సినిమా కోసం రెండు సార్లు పెళ్ళి వాయిదా వేసుకున్న వరుణ్..గ్రేట్ అంటూ?

Published

on

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా మార్చి 1వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుణ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరు అవుతున్నారు.

ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉన్నటువంటి  ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది నవంబరు ఒకటవ తేదీ ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ గత ఏడాది జూన్ 20వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్నారు. నిశ్చితార్థం తర్వాత తన కుటుంబ సభ్యులు రెండుసార్లు పెళ్లికి ముహూర్తం పెట్టినప్పటికీ వరుణ్ తేజ్ పెళ్లిని వాయిదా వేసుకున్నారు.

Advertisement

ఆపరేషన్ వాలెంటైన్..
ఈ విధంగా వీరిద్దరూ పెళ్లిని వాయిదా వేసుకోవడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది.ఆపరేషన్ వాలంటైన్ సినిమా షూటింగ్ మధ్యలో పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించారట అయితే పెళ్లి పనులలో బిజీగా ఉండడంతో సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందని అంతేకాకుండా తాను పూర్తిగా డిస్టర్బ్ అవుతాను అన్న ఉద్దేశంతో వరుణ్ తేజ్ రెండుసార్లు పెళ్లిని వాయిదా వేసుకుని సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నవంబర్లోనే పెళ్లి చేసుకున్నారట. ఈ విషయం తెలిసిన మెగా ఫాన్స్ డెడికేషన్ అంటే ఇదే కదా అంటూ వరుణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Charan -Ntr: చరణ్ ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ ను అలా సేవ్ చేసుకున్నారా?

Published

on

Charan -Ntr: సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలో మంచి స్నేహితులగా కొనసాగుతూ ఉంటారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఒకరిని చెప్పాలి.

వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉన్నట్టు చూపించారు. అయితే సినిమాలో మాత్రమే కాదు నిజజీవితంలో కూడా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అనే సంగతి అందరికీ తెలిసిందే.

ఇలా వీరిద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ ఉండడంతో వీరికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫోన్ నెంబర్ ను రామ్ చరణ్ తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నారనే విషయం గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ని అభిమానులు తారక్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.

Advertisement

తార్….
ఈ క్రమంలోనే రామ్ చరణ్ తారక్ పేరును తార్ అని సేవ్ చేసుకున్నారని తెలిసి అభిమానులు వీరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా పనులలో బిజీగా ఉండగా తారక్ దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!