Writer Kanagala Jayakumar : తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, సావిత్రి ముందుంటారు, ఇక మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లంటే తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళవంటి వారు. ఒకరు జానపదం, పౌరాణికంకి రారాజు అయితే మరొకరు సాంఘిక, కుటుంబ కథాచిత్రాల రారాజు. పౌరాణికాల్లో తనకు పోటీ ఎవరూ లేరని ఎన్టీఆర్ ముద్ర వేసుకుంటే, ప్రేమికుడి పాత్రలో తనకు సాటి లేరని నాగేశ్వరావు నిరూపించుకున్నారు. ఇద్దరూ అప్పట్లో పోటీపడి నటించేవారు. ఇద్దరి సినిమాలకు గట్టి పోటీ ఉండేది. అయితే ఒకానొక సందర్భంలో నాగేశ్వర్రావు గారు ఎన్టీఆర్ గారి పోటీని తట్టుకోలేక చెన్నై వదిలి హైదరాబాద్ వచ్చేసారంటూ రైటర్ కనగాల జయకుమార్ తెలిపారు.

నాగేశ్వర్రావు గారికి ఆంగ్లం రాదు… బాగా ఇబ్బంది పడ్డారు…
జయకుమార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా అలాగే రైటర్ గా పనిచేస్తున్న సమయంలో నాగేశ్వర్రావు గారి గోపాలకృష్ణుడు సినిమాకు పనిచేసే అవకాశం వచ్చిందని తెలిపారు. ఆ సమయంలోనే ఆయనను చాలా దగ్గరగా గమనించే అవకాశం లభించిందని, అందరూ పుస్తకాలను చదివి జ్ఞానం తెచ్చుకుంటే నాగేశ్వరావు గారు మాత్రం జీవితమనే పుస్తకం నేర్పించిన పాఠాలను నేర్చుకున్నారు. ఆయన చదువుకోక పోయినా ఆంగ్లం అనర్గలంగా మాట్లాడగలరు. మొదట్లో ఆయన ఎన్ఆర్ఐ అభిమానుల కోసం అమెరికా వెళ్లి ప్రసంగించాల్సిన సందర్భంలో మొదట్లో ఇబ్బంది ఎదుర్కొన్నా ఆపైన ఇంగ్లిష్ లో బాగా మాట్లాడటం నేర్చుకున్నారు.

ఇక 70 దశకంలో ఎన్టీఆర్ గారు కమర్షియల్, మాస్ హీరోగా ఎదిగిన క్రమంలో నాగేశ్వరావు గారు ఆయన నుండి పోటీ ఎదుర్కొనలేక, ఇక అప్పట్లో విజయ సంస్థకు పర్మినెంట్ హీరోగా ఎన్టీఆర్ ఉండటంతో ఏఎన్ఆర్ గారు తనకంటూ నిర్మాణ సంస్థలు ఉండాలని భావించి కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండే ఆయన ఆ సమయంలోనే ఎన్టీఆర్ తో పోటీ పడలేక హైదరాబాద్ వచ్చేయాలని భావించి వచ్చేసారు. హైదరాబాద్ ల్ సారథి స్టూడియోస్ తో గొడవ కారణంగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు అంటూ జయకుమార్ గారు వివరించారు.



























