Writer Sai Madhav Burra : రానా సినిమా కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాతో రైటర్ గా ఇండస్ట్రీ కంట్లో పడిన బుర్రా సాయి మాధవ్ ఆతరువాత వచ్చిన శర్వానంద్ సినిమా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా డైలాగలతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక ఆ తరువాత పెద్ద సినిమాలతో వెను తిరిగి చూసుకోలేదు సాయి మాధవ్. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంతో అగ్ర హీరోల సినిమాలకు అలానే పెద్ద దర్శకుల సినిమాలకు రైటర్ గా పనిచేస్తూ బిజీ అయిపోయారు. తన సినిమా కెరీర్ గురించి పలు విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూ లో పంచుకున్నారు మాధవ్.

త్రివిక్రమ్ రాస్తాడని భయమేసింది…..
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా సాయి మాధవ్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. ఆ సినిమా హిట్ అవడం అందులో డైలాగులు జనాలకు బాగా నచ్చడంతో పవన్ కళ్యాణ్ సినిమా గోపాల గోపాల కు పనిచేసే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా కావడం తో పెద్ద హీరో సినిమాకు పనిచేసే అవకాశం బాగా రాయాలి అనుకున్న సమయంలో సోషల్ మీడియాలో గోపాల గోపాల సినిమాకు త్రివిక్రమ్ డైలాగులు రాస్తాడు అని వార్తలు రావడంతో పవన్ కళ్యాణ్ వెర్షన్ డైలాగులు ఆయన్ రాస్తాడేమో నాకు అవకాశం లేదేమో అనుకుని టెన్షన్ పడ్డాను అంటూ సాయి మాధవ్ తెలిపారు. అయితే డాలీ గారిని అసలు విషయం అడుగగా అదేం లేదు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మకండి మీరే మొత్తం సినిమాకు డైలాగులు రాస్తున్నారు అని చెప్పడంతో ఊపిరి తీసుకున్నారట.

ఇక చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 కి పనిచేసిన అనుభవంతో సైరా నరసింహ రెడ్డి సినిమాకు వేమా రెడ్డి గారితో కలిసి పనిచేయమని అవకాశం వస్తే అసలు నమ్మలేదు అంటూ తెలిపారు. నాగబాబు ఫోన్ చేసి అన్న మీకు ఫోన్ చేసి మాట్లాడుతారు అని చెప్పగా కలా.. నిజామా.. చిరంజీవి గారు ఫోన్ చేయడం ఏమిటి అని ఆలోచించారట. ఇక చిరంజీవి గారు ఫోన్ చేసి కలవాలి అనగానే పరిగెత్తుకెళ్ళాను సైరా సినిమా కోసం పని చేస్తారా అని అడిగారు నా పై నమ్మకం తో నన్ను పెట్టుకున్నందుకు ఇంకేం కావాలి అనిపించింది అంటూ సాయి మాధవ్ గారు తెలిపారు. ప్రస్తుతం హరి హార వీరమల్లు, శాకుంతలం వంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు బుర్రా సాయి మాధవ్ గారు.

































