Connect with us

Featured

Writer Sri Sri : శ్రీశ్రీ మాట పడిపోయిన పాట ఆపలేదు.. మంచంపై నుండి రాసిన చివరి పాట.. ఆ తరువాత ‌పాపం క్యాన్సర్ తో అనంత లోకాలకు.!!

Published

on

Writer Sri Sri : మద్రాస్ లో ఉండడంతోనూ, ఆధునిక కవి కావడంతోనూ సినిమా వారి పరిచయం బాగా వుండేది. ప్రత్యక్షంగా సినిమాలతో సంబంధం లేకపోయినా పరోక్షంగా సంబంధం వుండేది. 1950లో ఆ సంబంధం పూర్తిగా ప్రత్యక్షమయ్యింది. తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా “ఆహుతి”కి ఇతడు మాటలు, పాటలు వ్రాశాడు. ఇది హిందీ చిత్రం “నీరా ఔర్ నందా”కి ఈ సినిమా తెలుగు అనువాదం. కవిత్వంలో రకరకాల ఫీట్లు చెయ్యడం ఇతడికి తెలుసు కాబట్టి డబ్బింగ్ ఫీట్ కూడా ఇతను చేయగల సమర్థుడని ఈ అవకాశం దక్కింది. ఇది డబ్బింగ్ సినిమా అయినా దీనిలో శ్రీశ్రీ మంచి పాటలు వ్రాశాడు. ఈ పాటల మూలంగానే ఇతడికి రోహిణి సంస్థలో హెచ్.ఎం.రెడ్డి నెలకు 300 రూపాయల జీతమిచ్చి ఇతనిని ఆస్థాన రచయితగా వేసుకున్నాడు.

నిర్దోషి సినిమాకు కొన్ని పాటలు వ్రాశాడు. మూనాన్ ప్రపంచం అనే సినిమా తీస్తూ ఇతడిని రచయితగా నెలకు 200 రూపాయలు జీతంతో నియమించుకున్నాడు. ఆ విధంగా ఇతడికి నెలకు 500 రూపాయలు రాబడి రావడంతో సినిమాలలో స్థిరపడ్డాడు. అలా ఈ ఉద్యోగాలు మూడేళ్ళపాటు సాగాయి. ఒక సారి ఒక కన్నడ చిత్రానికి తెలుగులో డబ్బింగ్ డైలాగులు వ్రాయడానికి మైసూరుకు వెళ్ళినప్పుడు అక్కడ ఇతనికి బి.విఠలాచార్యతో పరిచయం కలిగింది. అతను కన్నడలో తీసిన కన్యాదానం అనే సినిమాను తెలుగులో కూడా నిర్మించదలచి శ్రీశ్రీని రచయితగా నియమించుకున్నాడు. ఇతడు మైసూరులో వుండి ఒక్కరోజులో 12 పాటలు వ్రాశాడు. ఇది ప్రపంచ చలనచిత్రలోకంలో ఒక రికార్డు!

తరువాత ఇతడు డబ్బింగ్ రచయితగా, పాటల రచయితగా స్థిరపడ్డాడు. డబ్బింగ్ సినిమాలకు పాటలు, మాటలు వ్రాశాడు. మామూలు చిత్రాలకు కూడా పాటలు వ్రాశాడు. అన్ని రకాల పాటలు ముఖ్యంగా ఉద్రేకం, ఉత్తేజం కలిగించే పాటలు ఇతడు వ్రాశాడు. తెలుగు వారిని ఉర్రూతలూగించిన చాలా సినిమా పాటలను రచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు అతను రాసిన “తెలుగు వీర లేవరా” అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. అయితే శ్రీశ్రీ రచనలు దశాబ్దాలు దాటి 1980 దశకం వచ్చేసరికి కొంత తగ్గుముఖం పట్టింది.

ఆ క్రమంలో 1983లో దర్శకుడు టి.కృష్ణ ఓ అభ్యుదయ చిత్రం రూపొందించాలనుకున్నారు. అలాగే సినిమాకి జనజాగృత పాటలను రాయించుకోవాలనుకున్నారు. ఆ క్రమంలో అభ్యుదయ, సామాజిక విప్లవాత్మక పాటల రచన చేసిన శ్రీ శ్రీ ఆయనకు గుర్తుకు వచ్చారు. కానీ శ్రీశ్రీ అప్పటికే అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఎలాగైనా ఈ సినిమాలో శ్రీశ్రీతో ఒక్క పాటైనా రాయించుకోవాలని దర్శకుడు టి.కృష్ణ, నిర్మాత పోకూరి బాబూరావు అనుకున్నారు. “నేటి భారతం” సినిమాలో పాపులర్ అయిన పాట..”భారతమాతను నేను బందీ నై ఉన్నాను”. అనే పాటను 1983, జూన్ 4న ఆస్పత్రిలో బెడ్ పై నుండి శ్రీ శ్రీ ఈ పాటను రాశారు. అప్పటికి వారం రోజుల క్రితమే శ్రీశ్రీకి మాట పడిపోయింది. ఆయన రాసిన పాటలో చరణంలో కాస్త మార్పు చేయడానికి ఈ సినిమాలో మూడు పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత అదృష్టదీపక్… శ్రీశ్రీ దగ్గరికి వెళ్లి ఆ పాటలోని చరణాన్ని ‌సరి చేయించారు.

రేపే ఆ పాట చిత్రీకరణ అయినా లొకేషన్ ఏమిటో యూనిట్ సభ్యుల్లో ఎవరికి టి.కృష్ణ చెప్పలేదు. మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో ఓ కాలి ఫ్లోర్ ని బుక్ చేయమని ఆయన పురమాయించారు. ఆర్ట్ డైరెక్టర్ తో ఒక చెరసాల దర్శకుడు టి.కృష్ణ వేయించారు. అలాగే భారతదేశ పటాన్ని గీయించారు, దాని చుట్టూ ఒక తాడును చుట్టించి మధ్యలో ఇసుక పోయించి విజయశాంతికి సంకెళ్లు పెట్టి మధ్యలో కూర్చోబెట్టారు. ఆ పాట చిత్రీకరణ అద్భుతంగా జరిగింది. 1983 లో విడుదలైన “నేటిభారతం” చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే శ్రీశ్రీ రాసిన పాట కూడా ప్రజాదరణ పొందింది.

ఆ తర్వాత క్యాన్సర్ మహమ్మారిని తట్టుకోలేని శ్రీ శ్రీ 1983 జూన్ 15 న తాను రాసిన జనజాగృతి రచనలన్ని సాహితీ అభిమానులకు వదిలేసి అనంతలోకాలకు పయనమయ్యారు. శ్రీ శ్రీ మరణం సినీ పరిశ్రమకే కాదు తెలుగు సాహితీ రంగానికి ఒక తీరని లోటు.. 1950 లో ఆయన రాసిన “మహాప్రస్థానం” కార్మిక, కర్షక, శ్రామిక పీడిత ప్రజలను ఉత్తేజపరుస్తూ.. వెలువడిన తెలుగు సాహిత్య సంకలనం. ఆధునిక తెలుగు సాహిత్యం మహాప్రస్థానానికి ముందు, తర్వాత అని విభజించేంతగా మహాప్రస్థానం ప్రజాదరణ పొందింది. ఆయన మరణానంతరం విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో అతని నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.శ్రీశ్రీ విగ్రహం, హైదరాబాదులోని ట్యాంకుబండ్ పై కూడా ప్రతిష్ఠించడం విశేషం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!