Y. Vijaya : తెలుగులో 1000 కి పైగా చిత్రాలతో అలరించిన సీనియర్ నటి వై. విజయ నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో సూర్యకాంతంలాంటి గయ్యాళి పాత్రలను మళ్ళీ ఆమెను గుర్తుచేసేలా చేసిన నటి విజయ మాత్రమే. చెన్నైలో మొదట డాన్స్ చేయడానికి, చదువుకోడానికి అంటూ వచ్చి అనుకోకుండా వెంపటి చిన్న సత్యం గారికి కనిపించడంతో ఆయన మొదటగా సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక శోభన్ బాబు గారితో హీరోయిన్ గా నటించిన విజయ స్వస్థలం కర్నూలు అయినా కడప లో పెరిగింది. ఇక తెలుగులో ఇప్పటికి సినిమాల్లో నటిస్తున్న విజయ తన అనుభవాలను ఆస్తుల గురించి వివరించారు.

ఆస్తుల విలువ, విజయ శాంతి ఇచ్చిన సలహా…
ఇక విజయ గారు డెబ్భైల్లోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా సినిమాల్లో మొదట హీరోయిన్ గాను ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. ఇక పులుసు పాత్రకు మంచి పేరు రావడంతో సినిమా అవకాశలు బాగా వచ్చి బిజీ ఆర్టిస్ట్ అయిన సమయంలో చెన్నై లో స్థలం కొని మరుసటి ఏడాది ఇల్లు కట్టామని చెప్పారు. ఇక తంజావూరులో కల్యాణ మండపం, కూతురు పేరిట కాంప్లెక్స్ ఉన్నాయని విజయ వివరించారు.

వందల కోట్ల ఆస్తులు లేవు కానీ ఎవరి దగ్గర చేయిచాచాల్సిన అవసరం లేదు అంటూ చెప్పారు. ఇక విజయ శాంతి ఇచ్చిన సలహా మేరకే కాంప్లెక్స్ కట్టామని వివరించారు. సినిమా షూటింగ్ అప్పుడు విజయ శాంతి నాకు 50000 ఉంటే చాలు అని అనేదట, ఇక విజయ గారు పదివేలు చాలంటూ మాట్లాడుకునేవారట. అ సమయంలోనే ఏదైనా సినిమాలు శాశ్వతం కాదు కాబట్టి వేరే ఆదాయ మార్గం చూడాలని, ఆస్తుల గురించి తాను చెప్పగానే షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని విజయ తలుచుకున్నారు. ఇక సావిత్రి గారి కథ తెలిసాక సినిమాలు శాశ్వతంగా కాదు ఎంతో కొంత ఇతర ఆదాయ మార్గం చూసుకోవాలి అనుకున్నాను. ఇక ఏనాడూ ప్రొడ్యూసర్స్ దగ్గర రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదని చెప్పారు.



























