ఆగ్రా: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యమునా నదిలో నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగింది. వరద నీరు చారిత్రక కట్టడం తాజ్ మహల్ గోడలను తాకే స్థాయికి చేరుకుంది, దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆగ్రా నగరానికి వరద హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.

ప్రమాద స్థాయిని మించిన నీటి మట్టం
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యమునా నదిలో నీటి మట్టం ప్రమాద స్థాయిని మించి పెరిగి, వరద నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం వరద పరిస్థితిని సమీక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది.
గతంలోనూ ఇలాంటి పరిస్థితే..
గతంలో కూడా 2023లో యమునా నదిలో ఇదే స్థాయిలో నీటి మట్టం పెరిగిందని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితి తాజ్ మహల్ కు ఎంతవరకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు తాజ్ మహల్ పునాదులకు నష్టం కలిగించవచ్చనే భయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతానికి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజ్ మహల్ వంటి చారిత్రక వారసత్వ సంపదను కాపాడటానికి మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
తాజ్‌మహల్ ఒడికి యమునా నీరు
— TeluguDesk (@telugudesk) September 8, 2025
హిమాచల్, ఉత్తరాఖండ్ వర్షాల ప్రభావంతో యమునా నది నీరు ప్రమాద స్థాయిని దాటి ఆగ్రాలో తాజ్‌మహల్ గోడ వరకూ చేరింది. అధికారులు వరద హెచ్చరిక జారీ చేసి నియంత్రణ చర్యలు చేపట్టారు. 2023లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.#tajmahal pic.twitter.com/kSxMzTbWtJ


























