Yash Master : చైతన్య మాస్టర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు… నోటికి వచ్చినట్లు మాట్లాడకండి…: యష్ మాస్టర్

0
191

Yash Master : గత వారం నెల్లూరు లోని ఒక హోటల్ లో ఉరివేసుకుని ఢీ లో పనిచేస్తున్న డాన్స్ మాస్టర్ చావా చైతన్య మరణించిన విషయం తెలిసిందే. ఎవరైనా సెలబ్రిటీకి సంబంధిచిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో చర్చకు దారి తీయడం కామన్. అయితే చైతన్య మాస్టర్ మరణించిన తరువాత మరణానికి కారణం అప్పులని కొంతమంది కాదు ఎవరి వల్లో చనిపోయాడని అంటుంటే మరి కొంతమంది పేకాట వల్లే మరణించాడని మాట్లాడారు. ఇక ఈ విషయం గురించి ఢీ డాన్స్ షో ద్వారా పైకి వచ్చిన వాళ్లలో ఒక్కడైన యష్ మాస్టర్ మాట్లాడారు.

నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు…

యష్ మాస్టర్ చైతన్య మాస్టర్ గురించి మాట్లాడుతూ అలా ఆత్మహత్య చేసుకుని చనిపోయి అందరినీ షాక్ కి గురిచేసాడు. ఢీ లో బాయ్స్ కి ఏది కావాలన్నా తాను చూసుకునే వాడు. అలాంటి మాస్టర్ చనిపోతే ఆయన మరణాన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన చనిపోయిన బాధలో వారి కుటుంబం సన్నిహితులు ఉండగా ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటం బాగోలేదు. పేకాట వల్లే చనిపోయాడు, అలా చనిపోయి ఉండకూడదు అంటూ ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు.

నిజానిజాలు తెలియకుండా చైతన్య మాస్టర్ తో పరిచయం ఉన్నా లేకున్నా ఇలా మాట్లాడటం ఏంటి, ఆయన ఎంత బాధ పడి ఉంటే చనిపోవాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటాడు. మైక్ ముందు పెట్టారు కదా అని అలా చేసి ఉండకూడదు ఇలా చేసి ఉండకూడదు అంటూ దయచేసి మాట్లాడకండి. మీ ఇంట్లో వాళ్లకే ఇలాంటి పరిస్థితి వస్తే అలానే మాట్లాడుతారా లేక మీకే అలాంటి పరిస్థితి వస్తే వేరొకరు ఇలా మాట్లాడితే మీకెలా ఉంటుంది అంటూ ప్రశ్నించారు.