Ycp Leader Karumuri Venkata Reddy : ఏపీ రాజకీయాల్లో అధికారపక్షమైన వైసీపీ లీడర్ల టార్గెట్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్. చిన్న లీడర్ల నుండి పెద్ధ నేతల వరకూ అందరూ పవన్ మీద విమర్శలు చేస్తున్నారు. కౌలు రైతులను ఆదుకోడానికి పవన్ కళ్యాణ్ సహాయం చేయగా ఆ విషయంలో అధికారపక్షాన్ని జనసేన నాయకులు విమర్శిస్తుండగా వైసీపీ నేతలు పవన్ మూడు పెళ్లిళ్ల ఇష్యూ నుండి మొదలు పెట్టి తాజాగా కొత్త పల్లవి అందుకున్నట్టు కనిపిస్తున్నారు. తాజాగా వైవీపీ లీడర్ కారుమూరి వెంకట రెడ్డి చేసిన వాఖ్యలు అలానే ఉన్నాయి.

లక్ష రూపాయలు పంచితే రాజకియనాయకుడు కాలేడు…
వెంకట రెడ్డి పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ లక్ష రూపాయలు ఎవరికో పంచగానే రాజకీయ నాయకుడు అయిపోలేడు. ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కౌలు రైతులకు అంటూ డబ్బు ఇస్తున్నా అంటున్నాడు, మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నపుడు కౌలు రైతులకు ఇవ్వవలిసిన నష్టపరిహారం ఇవ్వనప్పుడు ఏం చెసాడు అంటూ విమర్శించారు.

ముందు తన రోడ్డు షోల కోసం పిచ్చి అభిమానంతో వస్తున్న వారికి తొక్కిసలాటలో ఏదైనా అయితే వాటిని కాపాడమనండి అంటూ ఎద్దేవా చేసాడు. తన వాహనం వెనుక పిచ్చి అభిమానంతో పరిగెత్తుతూ ప్రాణాలు కోల్పోయేవారిని ఆదుకోమనండి అంటూ విమర్శించారు. ఇక లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడుతూ అసలు లోకేష్ అంటే ఎవరో తెలియదంటూ కామెంట్స్ చేశారు వెంకట రెడ్డి.