Eluru:ఏలూరులో దారుణం చోటుచేసుకుంది ప్రముఖ బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చాన్ భాష పై వైసీపీ మహిళ కౌన్సిలర్ లావణ్య దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం నటుడు చాన్ భాష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందనే విషయానికి వస్తే ..
ఏలూరు జిల్లా, జంగారెడ్డి గూడెంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం నాడు నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా నటుడు చాన్ భాష మాట్లాడుతూ తన స్థలాన్ని కొందరు నేతలు అధికారంతో ఆక్రమించారని పరోక్షంగా కౌన్సిలర్ లావణ్యను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

ఈ క్రమంలోనే తన గురించి పరోక్షంగా మాట్లాడటంతో ఎంతో ఆగ్రహం చెందిన కౌన్సిలర్ వెనకనుంచి ఒక్కసారిగా అతని పై దాడి చేసింది. ఈ విధంగా మహిళా కౌన్సిలర్ లావణ్య నటుడి పై దాడి చేయడంతో అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఇలా వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరగడం అనంతరం స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ఆస్పత్రి పాలైన నటుడు చాన్ భాష…
ఇక స్థలం ఆక్రమణ ఘటనపై నటుడు చాన్ భాష, మహిళా కౌన్సిలర్ లావణ్య ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి చాన్ భాష మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటన గురించి తెలియజేశారు.




























