గతంలో టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ నెలవారీగా ఉండేది. నెలకు ₹1000, 2000, 3000 అలా పుచ్చుకొని సినిమాలో హీరోగా నటించే వారు అప్పటి టాలీవుడ్ నటీనటులు.

విటలాచార్య, కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, చక్రపాణి వంటి దర్శక నిర్మాతల వద్ద కేవలం అయిదు వేలకే సినిమా పూర్తయ్యేంత వరకూ నటించాడు ఎన్టీ రామారావు. అక్కినేని నాగేశ్వరరావు కూడా 10,000 కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. శృంగార రాముడు సినిమాకి ఎన్టీఆర్ ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుని అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించారు.

కృష్ణంరాజు హీరోగా వచ్చిన తర్వాత ఏరియాల బిజినెస్ చేయడం ప్రారంభించాడు. కాలక్రమేనా సీనియర్ హీరోల రెమ్యునరేషన్ బాగా పెరిగిపోయింది. దర్శకుల రెమ్యూనరేషన్ కూడా హీరోలతో సరిసమానంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఏఎన్నార్, ఎన్టీఆర్ కేవలం జీతగాళ్లలాగా లాగా పనిచేసే తెలుగు పరిశ్రమ స్వర్ణయుగానికి నాంది పలికారు. వీళ్ళ గనుక ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లయితే నిర్మాతలకు ఆర్థిక ఒత్తిడి పెరిగిపోయేది. ఎక్కువ సినిమాలు కూడా రూపుదిద్దుకునేవి కావు. సినిమా పరిశ్రమలో పనిచేసే కళాకారులకు, కార్మికులకు ఉపాధి లేకుండా పోయేది. సూపర్ స్టార్ కృష్ణ కూడా 24 గంటల పాటు పని చేస్తూ ఎన్నో సినిమాల్లో నటించేవాడు కానీ పాతిక వేల నుంచి 50 వేల లోపు అతని రెమ్యునరేషన్ ఉండేది.

ఇక ఇప్పటి సినిమా పరిశ్రమలో హీరోల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే… ప్రభాస్ రూ. 70 కోట్లు, పవన్ కళ్యాణ్ రూ. 55కోట్లు చిరంజీవి రూ. 50కోట్లు, మహేష్ బాబు రూ. 45 కోట్లు, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ రూ30 కోట్లు తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ రూ. 25 కోట్లు, విజయ్ దేవరకొండ 10 కోట్లు, హీరో నాని 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఏదేమైనా అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందో మీరు గమనించవచ్చు. విశేషమేంటంటే సినిమా లాభాల్లో తమకు ఇంత రావాలి అని బడా హీరోలు ఒప్పందం పెట్టుకొని 100-200 కోట్లను తమ చేతుల్లో వేసుకుంటున్నారు.



























