చాలా సందర్భాల్లో మన దగ్గర ఉండే కరెన్సీ నోట్లు వేర్వేరు కారణాల వల చినిగిపోతూ ఉంటాయి. అయితే బస్సుల్లో, దుకాణాల్లో చినిగిపోయిన నోట్లను తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. వ్యాపారులు తాము చినిగిపోయిన నోట్లు తీసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. తాము తీసుకున్నా మరొకరు తీసుకోరని చెబుతూ ఉంటారు. కరెన్సీ నోట్లు క్వాలిటీగానే ఉన్నా కొన్ని సందర్భాల్లో తడవడం లేదా ఇతర కారణాల వల్ల చినిగిపోతూ ఉంటాయి.

10 రూపాయల నోటు 20 రూపాయల నోటు చినిగిపోయినా నష్టం లేదు కానీ 500 రూపాయలు, 2000 రూపాయల నోటు చినిగిపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. అయితే సులభంగానే చినిగిపోయిన నోట్లను మార్చుకుని కొత్త నోట్లను పొందవచ్చు. నోట్లు చినిగిపోతే బ్యాంకులు మార్గదర్శకాల ప్రకారం కొత్త నోట్లను ఇస్తాయి. ఆర్బీఐ గతంలోనే చినిపోయిన నోట్లను బ్యాంకులలో మార్చుకోవడానికి నియమనిబంధనలను విడుదల చేసింది.
సాధారణంగా బయట కొంతమంది డబ్బులు తీసుకుని చినిగిన నోట్లను మారుస్తూ ఉంటారు. అయితే బ్యాంకులు మాత్రం కస్టమర్ల నుంచి ఎటువంటి నగదును వసూలు చేయవు. ఫ్రీగానే చినిగిన నోట్లకు మార్చుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఈ బ్యాంక్, ఆ బ్యాంక్ అనే తేడాల్లేకుండా ప్రభుత్వం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లీ కస్టమర్లకు చినిగిన నోట్లు మార్చుకునే సౌకర్యం కల్పిస్తున్నాయి.
అయితే కొన్ని సందర్భాల్లో వేర్వేరు కారణాల వల్ల చినిపోయిన నోట్లను మార్చుకునే అవకాశం లేకపోవచ్చు. అలాంటి సమయంలో ఆర్బీఐకు వెళ్లి అక్కడ చిరిగిన నోట్లను సులువుగా మార్చుకోవచ్చు.




























