సాధారణంగా డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడేవాడు. కానీ అదే డాక్టర్ సీటు కోసం ఒక కుర్రాడు తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. ఎంతటి పిచ్చి అంటే.. దివ్యాంగుల కోటాలో సీటు వస్తుందని ఆశపడి, ఏకంగా తన కాలునే నరుక్కున్నాడు. వినడానికే ఒళ్ళు జలధరిస్తోంది కదా? అసలు ఆ కుర్రాడికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఆ వివరాల్లోకి వెళ్తే…

ఏం జరిగిందంటే..
యూపీలోని జౌన్‌పూర్ జిల్లా, ఖలీల్‌పూర్ గ్రామానికి చెందిన సూరజ్ భాస్కర్ అనే 20 ఏళ్ల కుర్రాడు. రెండేళ్ల నుంచి నీట్ (NEET) రాస్తున్నాడు. కానీ మార్కులు సరిపోవడం లేదు. జనరల్ కేటగిరీలో సీటు రావడం కష్టమని ఫిక్స్ అయిపోయాడు. ఎలాగైనా 2026 కల్లా స్టెతస్కోప్ మెడలో వేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
ఆ షాకింగ్ ఐడియా!
అక్కడే సూరజ్ బుర్రకి ఒక వింత ఆలోచన తట్టింది. “జనరల్ కేటగిరీలో సీటు రాదు.. అదే ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ కోటా అయితే తక్కువ మార్కులకే సీటు కొట్టేయొచ్చు కదా!” అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. రిజర్వేషన్ కోసం ఏకంగా తన ఎడమ పాదాన్ని తనే నరుక్కున్నాడు. బాబోయ్.. ఎంతటి గుండె ధైర్యం ఇది!
కట్టుకథ అల్లాడు కానీ..
ఆదివారం రక్తం మడుగులో పడి ఉంటే వాళ్ల అన్న చూసి షాక్ అయ్యాడు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేసి కాలు నరికేశారని సూరజ్ ఒక క్రైమ్ స్టోరీ వినిపించాడు. పోలీసులు సీన్ లోకి ఎంటరయ్యారు. కానీ సూరజ్ చెబుతున్న కథకి, అక్కడ దొరికిన ఆధారాలకి ఎక్కడా పొంతన కుదరలేదు. ఎందుకో పోలీసులకు డౌట్ కొట్టింది.
డైరీలో దొరికిన అసలు నిజం!
పోలీసులు స్టైల్‌లో ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. అప్పుడే వాళ్లకి సూరజ్ డైరీ దొరికింది. అందులో “2026 నాటికి నేను డాక్టర్ కావాలి” అని క్లియర్ గా రాసుకున్నాడు. అంతే కాదు, తన ఫోన్ సెర్చ్ హిస్టరీ తీస్తే.. దివ్యాంగుల కోటా రూల్స్ ఏంటి? కాలు ఎలా నరుక్కోవాలి? ఇలాంటివే ఉన్నాయి. ఇక చేసేదేం లేక తనే నరుక్కున్నానని ఒప్పుకున్నాడు.
చివరగా..
ప్రస్తుతం సూరజ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. డాక్టర్ సీటు సంగతేమో కానీ, పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు కేసు బుక్ అయ్యేలా ఉంది.
చూశారుగా.. చదువులో కాంపిటీషన్, పేరెంట్స్ నుంచి ప్రెజర్ ఉండొచ్చు. కానీ ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఉన్న జీవితం కూడా నాశనం అవుతుంది. డాక్టర్ అయ్యి నలుగురికి ప్రాణం పోయాలనుకున్న వాడే, ఇలా తన కాలుని తనే బలి తీసుకోవడం నిజంగా విషాదకరం.
A shocking case that has stunned many. Suraj Bhaskar, a 24-year-old NEET aspirant, allegedly amputated his own leg to seek disability quota admission in MBBS, as per police findings. Authorities say anaesthesia materials were recovered, and the case is now under detailed… pic.twitter.com/XdujXBMyxr
— OneVision Media (@onevision_media) January 24, 2026





























