Crime: తెలిసీతెలియని వయసు.. నిజానికి, అబద్దానికి తేడా తెలియకపోవడం… కేవలం అట్రక్షన్ నే ప్రేమగా భావిస్తుండటంతో అనేక మంది అమ్మాయిల జీవితాలు దుర్మార్గుల చేతుల్లో నలిగిపోతున్నాయి. శారీరకంగాా అనుభవించి మోహం చాటేస్తున్నారు.

కొంత మంది తమకు అడ్డుగా ఉంటుందని అడ్డు తొలగించేసుకుంటున్నారు. ఫలితంగా తమ బంగారు జీవితాన్ని అమ్మాయిలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటను ఎన్నో జరుగుతున్నా.. దుర్మార్గుల చేతితో అమాయకులు మోసపోతూనే ఉన్నారు.

ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సంతమాగులూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ… మోసం చేశాడు ఓ వ్యక్తి. శారీరకంగా వాడుకుని మోహం చాటేశాడు. దీంతోొ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన సంతమాగులూరు మండలంలోని మక్కెనవారి పాలెంలో సోమవారం జరిగింది.
బైకు పై మీ స్వగ్రామానికి తీసుకెళ్తా అని చెప్పి..
పోలీసుల కథనం ప్రకారం మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన గుంజి నారాయణ కుమర్తె పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితం కూలీ పనుల కోసం కొమ్మాలపాడు గ్రామానికి వెళ్లింది. ఆసమయంలో గ్రామానికి చెందిన షేక్ బాజీ అనే మెడికల్ దుకాణం నడిపే యవకుడితో పరిచయం ఏర్పడింది. బైకు పై మీ స్వగ్రామానికి తీసుకెళ్తా అని చెప్పి యువతికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఫోన్ నెంబర్ తీసుకుని.. యువతికి మరింత దగ్గరై .. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో సదురు యువతి గర్భం దాల్చింది. ఇది తెలిసి షేక్ బాజీ ఆ అమ్మాయి గర్భాన్ని తీసేయించాడు. ఆ తరువాత యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో యువతి సోమవారం ఉదయం ఎలుకల మందు తిని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడే పడిపోయింది. వివరాలు తెలుసుకుని పోలీసులు సమీపంలోని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.



























