Connect with us

General News

Crime: యువతికి లిఫ్ట్ ఇచ్చి..! గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. ! చివరకు ఏం జరిగిందంటే..

Published

on

Crime: తెలిసీతెలియని వయసు.. నిజానికి, అబద్దానికి తేడా తెలియకపోవడం… కేవలం అట్రక్షన్ నే ప్రేమగా భావిస్తుండటంతో అనేక మంది అమ్మాయిల జీవితాలు దుర్మార్గుల చేతుల్లో నలిగిపోతున్నాయి. శారీరకంగాా అనుభవించి మోహం చాటేస్తున్నారు.

Crime: యువతికి లిఫ్ట్ ఇచ్చి..! గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. ! చివరకు ఏం జరిగిందంటే..
Crime: యువతికి లిఫ్ట్ ఇచ్చి..! గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. ! చివరకు ఏం జరిగిందంటే..

కొంత మంది తమకు అడ్డుగా ఉంటుందని అడ్డు తొలగించేసుకుంటున్నారు. ఫలితంగా తమ బంగారు జీవితాన్ని అమ్మాయిలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటను ఎన్నో జరుగుతున్నా.. దుర్మార్గుల చేతితో అమాయకులు మోసపోతూనే ఉన్నారు. 

Crime: యువతికి లిఫ్ట్ ఇచ్చి..! గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. ! చివరకు ఏం జరిగిందంటే..
Crime: యువతికి లిఫ్ట్ ఇచ్చి..! గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. ! చివరకు ఏం జరిగిందంటే..

ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సంతమాగులూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ… మోసం చేశాడు ఓ వ్యక్తి. శారీరకంగా వాడుకుని మోహం చాటేశాడు. దీంతోొ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.  ఈ సంఘటన సంతమాగులూరు మండలంలోని మక్కెనవారి పాలెంలో సోమవారం జరిగింది. 

బైకు పై మీ స్వగ్రామానికి తీసుకెళ్తా అని చెప్పి..

పోలీసుల కథనం ప్రకారం మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన గుంజి నారాయణ కుమర్తె పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితం కూలీ పనుల కోసం కొమ్మాలపాడు గ్రామానికి వెళ్లింది. ఆసమయంలో గ్రామానికి చెందిన షేక్ బాజీ అనే మెడికల్ దుకాణం నడిపే యవకుడితో పరిచయం ఏర్పడింది. బైకు పై మీ స్వగ్రామానికి తీసుకెళ్తా అని చెప్పి యువతికి దగ్గరయ్యాడు.  ఈ క్రమంలోనే ఫోన్ నెంబర్ తీసుకుని.. యువతికి మరింత దగ్గరై .. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో సదురు యువతి గర్భం దాల్చింది. ఇది తెలిసి షేక్ బాజీ ఆ అమ్మాయి గర్భాన్ని తీసేయించాడు. ఆ తరువాత యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో యువతి సోమవారం ఉదయం ఎలుకల మందు తిని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడే పడిపోయింది. వివరాలు తెలుసుకుని పోలీసులు సమీపంలోని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Featured

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు

Published

on

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.

కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.

Advertisement

Continue Reading

Featured

Palnadu: పల్నాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం?

Published

on

Palnadu: పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. తెల్లవారితే వారి గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారు తెల్లవారుకుండానే వారి జీవితాలు అగ్ని మంటల్లో బూడిద అయ్యాయి. పసుమర్తి వద్ద ప్రయాణిస్తున్నటువంటి బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.

ఇలా వేగంగా ప్రయాణిస్తున్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆ టిప్పర్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి అయితే బస్సులో కూడా మంటలు చెల్లరేగడంతో పెద్ద ఎత్తున ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో భాగంగా టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ కూడా అగ్నికి ఆహుతి అయ్యారు.

ఇక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో ఆరుగురు ప్రయాణికులు కూడా సజీవ దహనం అయ్యారు.మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఇక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో ఇద్దరు ప్రయాణికుల జాడ కూడా ఇప్పటివరకు తెలియలేదు.
సజీవ దహనం..

Advertisement

ఇలా అర్ధరాత్రి కాడ నడిరోడ్డుపై ఈ విధమైనటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు ఆర్పడానికి భారీ స్థాయిలో ప్రయత్నించిన సాధ్యం కాని పరిస్థితిలు ఏర్పడటంతో ప్రయాణికులు మరణించారు. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బాపట్ల జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చి తిరిగి వెళుతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement
Continue Reading

Featured

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Published

on

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడమనేది చాలా పెద్ద విషయం. అలా చూసుకున్నా ఎన్టీవీ దేశ టెలివిజన్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తోందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఒకే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ దగ్గర కానున్నారు.

ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://www.youtube.com/watch?v=9sBOhC540e8

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!