టిక్ టాక్.. టిక్ టాక్… ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ టిక్ టాక్ గోలే ఎక్కువగా వినిపిస్తుంది… చిన్న, పెద్ద తేడా లేకుండా అంత టిక్ టాక్ మోజులో గడుపుతున్నారు. ఇక యువత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.. పొద్దున్న లేచింది మొదలు… రాత్రి నిద్రపోయే వరకు కూడా మొబైల్ మొబైల్ అంటూనే ఉన్నారు. సెల్ ఫోన్స్ మాయలో పడి యువత తమ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. అయితే ఈ టిక్ టాక్ మోజులో పది ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కొల్పిన సంఘటనలు చూసాం. లైక్స్ కోసం.. షేర్ లకోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేయడం ప్రాణాల మీదికి తెచ్చుకోవడం పరిపాటిగా మారింది.
తాజాగా ఒక యువకుడు రన్నింగ్ ట్రైన్ ను పట్టుకుని టిక్ టాక్ చేస్తుండగా ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. రన్నింగ్ ట్రైన్ పట్టుకుని పరిగెడుతూ ఆ యువకుడు పట్టు కోల్పోయి కింద పడిపోయాడు. అదృష్టవశాత్తు ఆ యువకుడికి ఎటు వంటి ప్రమాదం కాలేదు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ యువకుడు ఆ వీడియోను టిక్ టాక్ లో అప్లోడ్ చేసాడు. ఆ వీడియోకు ముప్పే వేల వ్యూస్.. కొన్ని వందల కామెంట్లు వచ్చాయి.. చాలా మంది ఆ యువకుడు చేసిన పనికి తిడుతూ కామెంట్లు పెట్టాడు. అయితే ఈ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
चलती ट्रेन में स्टंट दिखाना बहादुरी नही, मूर्खता की निशानी है। आपका जीवन अमूल्य है, इसे खतरे में ना डालें।
— Piyush Goyal Office (@PiyushGoyalOffc) February 18, 2020
नियमों का पालन करें, और सुरक्षित यात्रा का आनंद लें। pic.twitter.com/tauidfOqRj




























