60 ఏళ్ళ వయసులో యూట్యూబ్ స్టార్ అయిన గంగవ్వ నవ్వుల వెనక ఉన్న కన్నీటి గాధ !!

0
507

60 ఏళ్ళ వయసులో యూ ట్యూబ్ సెలబ్రెటీగా మారిన గంగవ్వ గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. గంగవ్వ అసలు పేరు మిలుక్కూరి గంగవ్వ. జగిత్యాల జిల్లాలోని లంబాడి తండాకి చెందిన గంగవ్వ చిన్న వయసు నుండి చాలా కష్టాలు పడింది..గంగవ్వ 3 సంవత్సరాల వయసులోనే తల్లి, తండ్రి చనిపోయారు. మేనత్త పెంపకంలో ఉండగా 5 ఏళ్ళ వయసులో మేనత్త కొడుకుతో పెళ్లి చేశారు. అల 5 సంవత్సరాల వయసులోనే పెండ్లి అయిన గంగవ్వని అత్త, మామలే తల్లితండ్రులాగా పెంచారు. ఆమెకు 20 సంవత్సరాలు వచ్చేసరికి నలుగురు పిల్లలు పుట్టారు.

గంగవ్వ భర్త తాగుడుకు బానిసై గంగవ్వని కుటుంబాన్ని సరిగా చూసేవాడు కాదు. అలంటి సమయంలో పొట్టకూటికోసం కూలి పనులు చేసుకుంటూ, ఉన్న కాసింత భూమి పండించుకుని తినేవారు. ఆ రోజుల్లో వైద్య సదుపాయాలు కూడా అంతగా ఉండేవి కాదు. గంగవ్న నలుగురు సంతానంలో 8 సంవత్సరాలు ఉన్న గంగవ్వ చిన్న కూతురు జబ్బు చేసి వైద్యానికి డబ్బులు లేక మరణించింది. అదే సమయంలో గంగవ్వ భర్త దుబాయ్ వెళ్ళడానికి 50000 రూపాయలు అప్పు చేసి మరీ పంపించింది. అలా వెళ్ళిన గంగవ్వ భర్త తిరిగి ఒక్క రూపాయి కూడా ఇంటికి పంపక పోవడంతో అప్పుల్లో కురుకు పోయింది గంగవ్వ కుటుంబం.

ఇలా ఎన్నో కష్టాలు పడుతూ బిడ్డలను పెంచుకుంటున్న గంగవ్వకి అత్త చనిపోవడంతో ఇంకా తేరుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. అలా కొద్ది రోజులకు మామ కూడా చనిపోయాడు. ఆ సమయంలో కూడా భర్త రాకపోవడంతో అత్త మామలకి గంగవ్వే తల కొరివి పెట్టాల్సివచ్చింది. ఆ తర్వాత పెద్ద కూతురుకి కూడా తాను ఒక్కత్తే కాళ్ళు కడిగి పెళ్లి చేసింది. ఆ రోజుల్లో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్తితి ఉండేది గంగవ్వకు. పనిలోకి వెళ్లకపోతే ఇంట్లో అందరూ పస్తులు ఉండే దయనీయ పరిస్థితి ఆమెది. కొద్దికాలానికి భర్త దుబాయ్ నుండి తిరిగి వచ్చిన పెద్ద ప్రయోజనం లేకుండాపోయింది గంగవ్వకి. నిత్యం బాగా తాగి గంగవ్వని కొట్టడం, తిట్టడం వంటివి చేసే వాడు.. అయినా ఎన్నో బాధలు పడి పిల్లల్ని పెంచింది గంగవ్వ..

ఇంతకీ గంగవ్వకి యూ ట్యూబ్ అవకాశం ఎలా వచ్చింది తెలుసుకుందాం.

గంగవ్వని యూట్యూబ్ కి పరిచయం చేసింది శ్రీకాంత్ అనే యువకుడు. శ్రీకాంత్ గంగవ్వకి దగ్గర బంధువు. మనవడీ వరస అయ్యే శ్రీకాంత్ కి యూట్యూబ్ లో వీడియోలు తీసి పెట్టే అలవాటు ఉండటంతో పల్లెటూరులో వీడియోలూ తీసి యూట్యూబ్ లో పెట్టేవాడు. అలా ఒక రోజు గ్యాంగవ్వతో సరదాగా మాట్లాడిన సంభాషణలను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు శ్రీకాంత్. గంగవ్వ వీడియో చూసినవారంతా ఆమె యొక్క అమాయకత్వం, తెలంగాణ యాసకు ఫిదా అయిపోయారు.

ఆ తర్వత వరసగా గంగవ్వతో ఏదోక వీడియో చేసి పెట్టేవాడు శ్రీకాంత్. అలా గంగవ్వ యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయింది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో కూడా హీరో రామ్ తో నటించింది. అంతే కాదండోయ్ గంగవ్వ కొంతమంది నటీనటులను ఇంటర్వ్యూ లు కూడా చేయడం చూస్తున్నాం. ఓ బేబీ సినిమా సమయంలో సమంత, నందిని రెడ్డిని తన ప్రశ్నలతో బాగా నవ్వించింది. ఇదండీ గంగవ్వ నవ్వుల వెనక దాగి ఉన్న కష్టాల జీవితం.

గంగవ్వ ఫొటోస్ మీకోసం

గంగవ్వ ఫొటోస్

గంగవ్వ ఫొటోస్

గంగవ్వ ఫొటోస్

గంగవ్వ ఫొటోస్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో గంగవ్వ

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో గంగవ్వ

సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండతో గంగవ్వ

సమంత, నందిని రెడ్డితో గంగవ్వ

కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ తో గంగవ్వ

డైరెక్టర్ శేఖర్ కమ్ములతో గంగవ్వ

హీరోయిన్ రాశి ఖన్నాతో గంగవ్వ

డైరెక్టర్ అనిల్ రావిపూడితో గంగవ్వ

యాంకర్ ఝాన్సీ, శ్రీముఖిలతో గంగవ్వ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here