యుట్యుబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ జశ్వంత్ మద్యం మత్తులో వీరంగం బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 10 లో తన కారుతో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కారు నడిపి అతివేగంతో రెండు కార్లు, రెండు బైకులను డీకోట్టాడు. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ప్రాథమిక చికిత్స అందించి.. ఆస్పత్రికి తరలించారు. మరోవైపు షణ్ముక్ కు‌ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా 170 రీడింగ్ వచ్చింది.

విషయం తెలుసుకున్న పోలీసులు షణ్ముక్ జశ్వంత్ను అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేసారు. యుట్యుబ్ లో పలు షార్ట్ ఫిలిం లతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న షణ్ముక్ ఇలా తాగి కారు నడపి బీభత్సం సృష్టించడం సంచలనం రేగుతుంది. షణ్ముక్ జశ్వంత్ తాజగా పలు టివీ చానల్స్ లో ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here