యూట్యూబ్ వెబ్ సిరీస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ద్వారా పలు వెబ్ సిరీస్ లో కామెడీ వీడియోలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు షణ్ముఖ్ జస్వంత్ . ఇలా పలు వీడియోలను చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ను పెంచుకున్న షణ్ముఖ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా ఇతని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు ఏకంగా 3 మిలియన్స్ కు పెరిగిపోయారు. ఒక్క వీడియో యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తే కేవలం గంటల వ్యవధిలోనే అతని వీడియోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తాయి. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న షణ్ముఖ్ ప్రస్తుతం యూట్యూబ్ స్టార్ గా వెలిగిపోతున్నారు.
ఇలా యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న షణ్ముఖ్ కి ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇలా మంచి క్రేజ్ సంపాదించుకున్న సమయంలో ఈయనకు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. బయట ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న షణ్ముఖ్ హౌస్ లో కూడా ఈయన రచ్చ మామూలుగా ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడానికి యూట్యూబ్ స్టార్ట్ పెద్ద మొత్తంలోనే పారితోషికం తీసుకుంటున్నారనే సమాచారం వినబడుతుంది. ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ షణ్ముఖ్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇతనికి బయట మంచి ఫాలోయింగ్ ఉండటం చేత ఈయన డిమాండ్ చేసిన దానికి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్ కి ఇవ్వకపోవడం గమనార్హం. హౌస్ లోకి అడుగు పెట్టిన షణ్ముఖ్ ఏ స్థాయిలో ప్రేక్షకులను సందడి చేస్తారు వేచి ఉండాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…