Youtuber Lally : రాకేష్ మాస్టర్ మూడో భార్యగా అందరికీ యూట్యూబ్ ద్వారా పరిచయమైన లక్ష్మీ అనే మహిళను తాజాగా కొంతమంది మహిళలు రోడ్డు మీదే చితక బాదారు. అయితే ఆమెను కొట్టింది నేనే అంటూ లల్లి అనే యూట్యూబర్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తనని కొట్టింది నేను మాత్రమే అంటూ తనని కొట్టడంవ తప్పు లేదంటూ లల్లి పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా బాగా వైరల్ అవుతున్న ఈ ఇష్యూలో లల్లి తన వెర్షన్ ఇంటర్వ్యూలో తెలిపారు.

నా కూతురుని అన్న మాటలకు పాప స్కూల్ కి వెళ్లడం లేదు…
రాకేష్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకునే లక్ష్మమ్మ ను యూట్యూబర్ లల్లి నడిరోడ్డు మీద బాగా కొట్టింది. అయితే తన కూతురుని నానా మాటలు ఆనింది అందుకే కొట్టినట్లు లల్లి యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. పసిపిల్ల అని కూడా చూడకుండా నీ కూతురుని ఎవరో ఒక బకరాకి ఎర వేయి డబ్బులు బాగా వస్తాయి అంటూ మాట్లాడింది, నన్ను ఎన్ని మాటలు అన్నా ఓపిక పట్టాను కానీ కూతురిని అనే సరికి ఆగలేకపోయాను అందుకే కొట్టాను అంటూ చెప్పారు.

అది అన్న మాటలు అర్థం చేసుకునే వయసు కూడా కాదు నా కూతురిది, ఈ ఇష్యూ జరిగాక నా కూతురు స్కూల్ కి కూడా వెళ్లడం లేదు. రాకేష్ మాస్టర్ కూతురిని కూడా ఇలానే మాట్లాడింది. అపుడే ఆయన ఏదైనా చేసి ఉంటే ఇపుడు నా కూతురు వరకు వచ్చేది కాదు. నేను వదిలేస్తే రేపు ఇంకో పసిపాపను అంటుంది అందుకే కొట్టాను అంటూ లల్లి చెప్పారు.































