YS Sharmila : తెలంగాణ వచ్చిన తరువాత వరుసగా రెండు సార్లు సీఎం అయి కొత్త రాష్ట్ర పాలన చేపట్టిన కెసిఆర్ కు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. గెలుస్తామనే ధీమా, తెలంగాణ ప్రజల మీద నమ్మకంతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన కెసిఆర్ తొందరపడినట్లే అనిపిస్తోంది. నవంబర్ 30 న తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరుగగా డిసెంబర్ 3 ఆదివారం నాడు ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే ఫలితం ఏమై ఉంటుందో అంటూ ఎగ్జిట్ పోల్స్ సర్వే లు కాంగ్రెస్, బిఆర్ఎస్ హోరా హోరిగా ఉండబోతున్నాయని జోరుగా చెబుతుండగా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని చాలా మంది భావిస్తున్నారు.

కెసిఆర్ కోసం షర్మిల గిఫ్ట్…
రాజశేఖర్ రెడ్డి కూతురు గా జగనన్న చెల్లిగా తెలుగు రాజకీయాలలోకి అడుగుపెట్టిన షర్మిల అన్న జైలులో ఉన్నపుడు వైసీపీ పార్టీని భుజాన వేసుకుని పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళింది. ఇక ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుండి దూరమై తెలంగాణ లో సెటిల్ అయినా షర్మిల కెసిఆర్ కి వ్యతిరేకంగా తన గళం విప్పింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్షంగ పాల్గొన కుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది.

ఇక ఇపుడు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారం లోకి రాబోతున్నట్లు చెప్తూ కెసిఆర్ కి గిఫ్ట్ కూడా ఇచ్చారు. బై బై కెసిఆర్ అని రాసి ఉన్న ఒక సూట్ కేసును బహుమతిగా కెసిఆర్ కు పంపుతూ కెసిఆర్ సీఎం గా దిగిపోయిన రోజును విమోచన దినంగా తెలంగాణ ప్రజలు జరుపుకోవాలని ఆమె సూచించారు. పదేళ్లు అధికారం కట్టబెడితే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదని ఆమె కెసిఆర్ మీద విరుచుకుపడ్డారు.





























