తెలంగాణలోని వైఎస్ అభిమానులతో చర్చలు జరుపుతోన్న వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ పేరు, జెండా, మొదలగు పలు అంశాలు లీక్ అవుతున్నాయి. తన తండ్రి పేరు కలిసివచ్చేలా తెలంగాణలో తానూ ఏర్పాటు చేయబోతున్న కొత్త పార్టీ కి వైఎస్ షర్మిల “YSR తెలంగాణ పార్టీ” అనే పేరుతొ కొత్త పార్టీని రిజిస్టర్ చేయించి మరో ముండగు వేసారు.

షర్మిల ముఖ్య అనుచరుడు రాజగోపాల్ భారత ఎన్నికల సంఘం దగ్గర ఈ పేరును రిజిస్టర్ చేసారు. ఈ క్రమంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను అయన ఎన్నికల సంఘంకు సమర్పించారు. ఏవైనా మార్పులు ఉంటె జూన్ 6 వరకు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది.


































