గత ఎలెక్షన్ సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతుంది. గతంలోనే ఈ కేసు విచారణ చేపట్టినా విచారణ సమయంలో కొంతమంది అధికారులకు కరోనా సోకడంతో సుమారు 7 నేలలపాతూ నిలిచిపోయిన విచారణ తాజగా నిన్న మొదలైంది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో రెండో రోజు సీబీఐ విచారణ కొసాగుతోంది. ఈ నేపధ్యంలో వివేకా ఇంట్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ఇదయతుల్లాను రెండో రోజు విచారణలో భాగంగా ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచారణ కొనసాగుతునట్టు తెలుస్తుంది. అయితే కంప్యూటర్ ఆపరేటర్ ఇదయతుల్లాతో పాటు వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని కూడా రెండో రోజు ప్రశ్నిస్తున్నారు అధికారులు. మాజీ డ్రైవర్ దస్తగిరిని నిన్న అనగా సోమవారం సుమారు ఏడు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఆయన్ను నెల రోజులుగా సీబీఐ అధికారులు దిల్లీలో విచారించి ఇటీవలే కడపకు పంపించారు.
































