Ys Vivekanandha wife Shamim : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతూ డైలీ సీరియల్ ను తలపిస్తూ కొత్త క్యారెక్టర్స్ పుడుతూనే ఉన్నారు. రోజుకో కొత్త వ్యక్తి పేరు ఈ కేసులో వినిపిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి దగ్గర విచారణ ఆగిపోయింది. అయితే ఇల్లీగల్ అఫైర్స్ వివేకానంద చావుకు కారణమని పలు మార్లు వినిపించినా వివేకానంద రెండో భార్య గురించి కూడా పలు కథనాలు వచ్చినా ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న ఆయన రెండో భార్య మొదటి సారి నోరు విప్పారు. ఆమె సిబిఐ ముంగిట పెట్టిన విషయాలలో ఇంట్రేస్టింగ్ అంశాలు ఉన్నాయి. వివేకానంద తో పరిచయం, పెళ్లి దగ్గరి నుండి తాను హత్య కు గురయ్యే గంట ముందు కూడా మాట్లాడినట్లు షమీమ్ చెబుతోంది. ప్రస్తుతం ఈమె స్టేట్మెంట్ విచారణలో కీలకం కానుంది.

భార్య అనారోగ్యం గురించి చెప్పేవాడు….
ఏంఎస్సీ చదివిన షేక్ షమీమ్ 2008 లో ఉద్యోగం కోసం రెడ్డీస్ ల్యాబ్ కి వెళ్ళినపుడు వివేకానంద పరిచయం అని అతని రిఫరెన్స్ ద్వారా వెళ్లిన జాబ్ ఇవ్వకపోవడంతో వివేక స్వయంగా వచ్చి జాబ్ ఇవ్వాల్సిందిగా చెప్పాడని ఆ సంవత్సరం లోనే వివేకా తనకు ప్రపోజ్ చేసినట్లు షమీమ్ తెలిపారు. అయితే రెండు ఏళ్ల సమయం తీసుకున్నాను తరువాత 2010 లో తాను అంగీకరించినట్లు షమీమ తెలిపారు. తన భార్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఎపుడు చెప్పేవాడని తన భార్య అంటే చాలా ప్రేమ ఉందని అందుకే ఇంకా వివేకా అంటే గౌరవం పెరిగిందని తెలిపారు.

అలా 2010 లో వివాహం చేసుకున్న తమకు 2011 లో మరోసారి వివాహం అయిందని 2015 లో షహన్షా జన్మించాడని తెలిపారు షమీమ్. తమ బంధం వైఎస్ కుటుంబంలో ఎవరు అంగీకరించలేదని సునీత పలు మార్లు ఫోన్ చేసి దూరంగా ఉండమని బెదిరించిందని ఇక వివేకా బావ మరిది, అల్లుడు నర్రేడ్డి రాజశేఖర్ రెడ్డి అన్న శివప్రకాష్ రెడ్డి పలుమార్లు తన కుటుంబ సభ్యులను బెదిరించారంటు తెలిపారు. ఇక శివప్రకాష్ రెడ్డి కి వివేకా పదవి మీద , అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఆస్తి మీద కన్ను ఉందని తెలిపారు. ఇక బెంగళూరు లో 8 కోట్ల సెటిల్మెంట్ గురించి చెప్పాడని హత్య జరిగిన రోజు కూడా ఫోన్లో మాట్లాడని షమీమ్ తెలిపారు. హత్య అనంతరం ఇంటికి వెళ్లాలనుకున్నా శివ ప్రకాష్ రెడ్డికి బయపడి వెళ్ళలేదని తెలిపారు.





























