YSRCP vs TDP : ఎన్నికల ముందేమో టీడీపీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లే వైసీపీకి మెయిన్ టార్గెట్. ఇప్పుడు వైసీపీ టార్గెట్‌లో పవన్ లేరు. కేవలం టీడీపీ అధినేత సహా నేతలంతా ఉన్నారు. వారిని వదలొద్దు.. పవన్ జోలికి వెళ్లొద్దని జగన్ తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారట. అదేంటి? ఇంత సడెన్‌గా జగన్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? పవన్ వద్దు.. ఆయన వ్యక్తిగత జీవితం గురించి వద్దన్నారట. ఒకప్పుడు జగన్ అయితే ముందుగా పవన్‌తోనే మొదలు పెట్టేవారు. పవన్ వ్యక్తిగత జీవితం గురించి కూడా ప్రస్తావించేవారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ నానా రచ్చ చేసి అడ్డంగా బుక్కైన రోజులూ ఉన్నాయి. జగనే నా నాలుగో పెళ్లామని పవన్ అనడంతో జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు అందుకున్నారు. జగన్‌ను వదినమ్మ అంటూ నెట్టింట ఒకాట ఆడుకున్నారు. దత్త పుత్రుడని.. ప్యాకేజీ స్టార్ అనీ నానా హంగామా చేశారు. ఆ పార్టీ నేతలు సైతం జగన్ బాటలోనే నడిచేవారు. పవన్ చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాన్ని ఎంతగా డ్యామేజ్ చేయాలో అంతగా జగన్ డామేజ్ చేశారు.

జనం కోసం స్ట్రాంగ్‌గా..
టీడీపీని గెలిపించే ప్రధానాస్త్రం పవనేనని అప్పుడు వైసీపీ ఆలోచన. ఇది నిజమే. టీడీపీ కూటమి గెలిచిందంటే దానికి పవనే కారణం. అందుకే ముందుగా పవన్‌ను వైసీపీ దెబ్బ తీయాలనుకుంది. ఎమోషన్‌ల్‌గానూ.. రాజకీయంగానూ దెబ్బతీయాలని నానా రకాలుగా ప్రయత్నించింది. కానీ కుదరలేదు. పవన్ అంతకంతకూ స్ట్రాంగ్ అయ్యారు. తన వాయిస్‌లో బేస్‌ను పెంచారు. ఇక రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారికైతే పట్టపగ్గాలు ఉండేవి కావు. వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. వీరంతా తమ పదవీకాలంలో సగ భాగాన్ని పవన్‌ను తిట్టేందుకే ఉపయోగించారంటే అతిశయోక్తి కాదు. ఇక గుడివాడ అమర్‌నాథ్ అయితే ఏకంగా పవన్ తనతో సెల్ఫీ దిగాడంటూ నానా రచ్చ చేసి జనసైనికుల దగ్గర అడ్డంగా బుక్ అయ్యారు. ఇవన్నీ జనసేనకు బాగా ప్లస్ అయ్యాయి. సింపతీ బీభత్సంగా పెరిగిపోయింది. పవన్ కూడా జనం కోసం స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. దీంతో జనాలు పవన్ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి రాజకీయంగా ఆయనేంటో చూశారు. గుండెల్లో పెట్టుకున్నారు. అసెంబ్లీ గేటు కూడా దాటనీయము అని శపథాలు చేసిన వారిని ఇంట్లో కూర్చోబెట్టి పవన్‌ను దర్జాగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సీటులో కూర్చోబెట్టారు.

నేతలకు ఇంటర్నల్ ఆదేశాలు..
మరి ఇంత చేసిన జగన్.. ఎందుకు పవన్‌ను దూషించవద్దని చెబుతున్నారు అంటారా? ఇంకా ధూషిస్తే కాలగర్భంలో పూర్తిగా కలిసి పోతామని తెలిసొచ్చింది కాబట్టి. వవన్ ఇప్పటికే కక్షలూ కార్పణ్యాలు వద్దు. కేవలం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోదామని చెబుతున్నారు. అటువంటి పవన్‌ను టార్గెట్ చేస్తే రాజకీయంగా వచ్చేది ఏమీ లేకపోగా.. ఇంకా ఇంకా అభాసు పాలవ్వాల్సి వస్తుంది. పవన్ కారణంగానే తనకు అంత పెద్ద డ్యామేజ్ జరిగిందని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా టార్గెట్ చేస్తే కష్టమని భావించే జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే నేతలతో పాటు క్యాడర్‌కు సైతం ఇంటర్నల్ ఆదేశాలిచ్చారు. సాధ్యమైనంత వరకూ పవన్‌ను టచ్ చేయకూడదన్నదే వైసీపీ లక్ష్యం. అందుకే పవన్ వైసీపీ అరాచకంపై అడపా దడపా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నా కూడా వైసీపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. పోనీలే.. ఇప్పటికైనా జగన్‌కు కాస్త వివరం వచ్చినట్టుంది. ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే జనాగ్రహానికి గురవడం తప్ప ఒరిగేదేమీ ఉండదని తెలుసుకున్నారు.





























