దేశంలో కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ ప్రజలను భయపెడుతోంది. ఈ క్రమంలో దేశీయ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా చికిత్సలో ప్రభావవంతగా పనిచేస్తున్న, డీఆర్‌డీవో, రెడ్డీస్ సంయుక‍్తంగా అభివృద్ధి చేసిన 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2డీజీ) డ్రగ్ ఇక మార్కెట్‌లో లభ్యం కానుంది.

సోమవారం 2డీజీ ఔషధాన్ని కమర్షియల్‌గా లాంచ్ చేసింది. దేశంలోని ప్రధాన ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ ఉత్పత్తిని సరఫరా చేయనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. 99.5 శాతం సమర్ధత కలిగిన ఈ 2డీజీ సాచెట్ 990 రూపాయల వద్ద ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ రేటుతో అందించనుంది.































