గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరమని,సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించడం జరిగిందని తెలిపారు.

ఇక ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతుణ్ణి కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. యువతులు, మహిళల పై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహిళల రక్షణ మా ప్రథమ కర్తవ్యం. ఇందుకోసమై అహర్నిశలు శ్రమిస్తామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.































