కరోనాతో ప్రముఖ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొద్దిరోజుల క్రితమే కరోనాతో ఆమె కుమారుడు సంజయ్ మరణించిన విషయం తెలిసిందే.. ఇక ఆమె భర్త కూడా కోవిడ్ -19 తో పోరాడుతూ ఈరోజు తుది శ్వాశ విడిచారు.

వివరాల్లోకి వెళితే.. నటి కవిత భర్త దశరథ రాజు కొద్దిరోజులు ఇంటిలోనే హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. అయితే అతని ఆరోగ్యం క్షీణించడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఈరోజు అయన కన్నుమూసారు. చాలా రోజులుగా కరోనాతో పోరాడుతున్న అయన ఈరోజు కన్నుమూసినట్టు సమాచారం. సరిగ్గా 15 రోజుల క్రితం జూన్ 15న కవిత కుమారుడు కోవిడ్ -19 కారణంగా ప్రాణాలను కోల్పోయాడు.


































