టాలీవుడ్‌లో తమన్నా భాటియా స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్..ముఖ్యంగా ముంబై లేదా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు మహా అయితే మూడు నాలుగు సినిమాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఓ పది పదిహేనేళ్ళు ఇండాస్ట్రీలో..అది కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇక్కడ సక్సెస్ రాకపోతే హీరోయిన్స్ ని అంతగా పట్టించుకోరు. పైగా రెండు ఫ్లాపులొస్తే ఐరెన్ లెగ్ అని అంటారు. హీరో ముసలివాడైన తర్వాత కూడా హీరో వేషాలు వేయడానికి రెడీగా ఉంటారు. కానీ హీరోయిన్ విషయంలో అలా ఉండదు.

ఇదే మాట తమన్నా కూడా చెబుతోంది. టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంటరయింది. ఇందులో సమీర్ అఫ్తాబ్ కి జంటగా నటించింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. కానీ లక్కీగా అదే సంవత్సరం మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన శ్రీ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది.

ఇలా తమన్నా అటు హిందీ ఇటు తెలుగులో నటించిన డెబ్యూ సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇక 2006లో జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఆయన తమ్ముడు రవికృష్ణ కి జంటగా కేడీ సినిమాతో కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఇలియానా మరో హీరోయిన్ గా నటించింది. ఇందులో తమన్నా నెగిటివ్ పాత్రను పోషించింది. ఆ సినిమా కూడా ఫ్పాయింది. ఆ తర్వాత తమిళంలో ఎస్.జె. సూర్య కి జంటగా వ్యాబారి సినిమాలో నటించింది. ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. అయితే టాలీవుడ్ లో తమన్నా 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన హ్యాపీ డేస్ సినిమాతో భారీ హిట్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సాధారణంగా ఒక భాషలో ఫ్లాపయితేనే మళ్ళీ ఆ హీరోయిన్ గురించి పట్టించుకోరు. అలాంటి మూడు సినిమాలూ మూడు భాషలలో నటించగా ఫ్లాపయినప్పటికీ తమన్నా కి లక్ బాగా ఫేవర్ చేసి స్టార్ హీరోయిన్ అయింది. ఇక 2009లో కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం తమన్నాకి మరో సూపర్ హిట్ ఇచ్చింది. ఇందులో సిద్దార్థ్ హీరో. అలాగే మెగా పవర్ స్టర్ రాం చరణ్ తో రచ్చ చేసింది. ఇలా వరుసగా ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ సహా హిందీ, తమిళ సినిమాలలో నటించి విపరీతమైన స్టార్ డం తెచ్చుకుంది.

అయితే హీరోయిన్స్ కి అవకాశాలు వచ్చినప్పుడే చేసుకోవాలి. లేదంటే గట్టి పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీలో తట్టుకొని నిలబడటం కష్టమని చెప్పుకొచ్చింది. తమిళ ప్రేక్షకులను
హీరోయిన్ బొద్దుగా ఉండాలి. లేదంటే ఆమెను చూడటానికి అంతగా ఆసక్తి చూపించరు. కానీ ఇది తమన్నా విషయంలో రివర్స్ అయింది. ఆమె నాజూకుగా ఉన్నా అక్కడి వాళ్ళు తనని ఆదరించారు. ఎక్కడైనా నంబర్ వన్ అనేది కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత ఎవరో ఒకరు వచ్చి స్టార్ డం తెచ్చుకుంటే దానికి మనం ఏం చేయలేము. హీరోయిన్స్ కి లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఆ తర్వాత వచ్చేవన్నీ అక్క, వదిన పాత్రలే. మనకి క్రేజ్ ఉన్నప్పుడే హీరోయిన్‌గా అవకాశాలు వస్తాయి.. అది మనకి నచ్చితే చేస్తాము లేదంటే లేదు అని తమన్నా చెప్పుకొచ్చింది.



































