అమ‌రవీరుల కుటుంబాల‌కు కోటి రూపాయ‌ల ఎక్స్‌గ్రేషియా !

0
214

అమ‌రవీరుల కుటుంబాల‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం కోటి రూపాయ‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది. దేశానికి సేవ చేస్తూ అమరవీరులైన సైనికుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం అండ‌గా ఉంటుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు.

అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన వెంటనే, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, పోలీసు సిబ్బంది కుటుంబాలకు కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించార‌ని గుర్తు చేశారు. ప్రియమైన వ్యక్తి అమరవీరుడైనప్పుడు ఒక కుటుంబం అనుభవించే బాధ తీర్చ‌లేనిద‌న్నారు. అయితే ఈ ఆర్థిక స‌హాయం బాధిత‌ కుటుంబం గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు స‌హాయ‌ప‌డుతుంద‌ని సిసోడియా అన్నారు.