చింతపండు ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిదే.
చింతపండులో 20.9 శాతం తేమ ఉంటుంది.
- 3.1 శాతం ప్రొటీన్లుంటాయి,
- 0.1 శాతం కొవ్వు పదార్థం,
- 2.9 శాతం ఖనిజాలుంటాయి,
- 67.4 శాతం కార్బోహైడ్రెస్ ఉంటాయి.
కాల్షియం, పాస్పరస్, ఇనుము, క్రోటిన్ , రిబోప్లవిన్, విటమిన్ ‘సి’ కొద్దీ శాతంలో ఉంటాయి,
అజీర్తిని, చిన్న ప్రేగుల్లో గాస్ ని పోగొడుతుంది. చింతపండు ఆకలి కలిగిస్తుంది. విటమిన్ సి కోసం చింతపండు, చింతకాయ వాడవచ్చు.
కాళ్ళ వాపులకు కొందరు వైద్యులు చింతాకులను నూరి ఆ ముద్ద పట్టిస్తుంటారు. గొంతు వాసినవారికి చింతపండు నీరు వాడుతుంటారు.
వైద్యం మాట ఎలా వున్నా శరీరం ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన పోషక పదార్ధాలు అన్ని కాయగూరల్లో వున్నట్టే చింతకాయలోను ఉన్నాయి. మధ్య వయస్కులు మాత్రం వైద్యుల సలహా మేరకు చింతకాయలు, చింత పండు అధికంగా వాడరు,
కానీ చిన్న వయసు వాళ్ళు చింతకాయను మిగతా కూరల్లాగే తరచూ ఆహారంలో తీసుకోవాలి. ఇది శరీరానికి అవసరమైన చల్లదనాన్నిచ్చి, రోగనిరోధక శక్తిని పెపొందించుతుంది.