చీర కట్టులో “జాను” సమంత ఫొటోస్ !!

0
909

హీరో శర్వానంద్, టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని జంటగా నటించిన చిత్రం జాను. 2019 రిలీజ్ అయినా రణరంగం సినిమా తరువాత శర్వానంద్ చేస్తున్న చిత్రం ఇదే. ఓ..బేబీ తరువాత సమంత నటించిన చిత్రం ఇదే.. అయితే ఈ సినిమా విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం, తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు రీమేక్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. “96” చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ “జానూ” సినిమాకి కూడా ఈయనే దర్శకుడిగా కొనసాగుతున్నారు.

అయితే దాదాపు చిత్రీకరణ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం, ఇది వరకే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. మొన్న సినిమాలో మొదటి పాటను కూడా రిలీజ్ చేసారు. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ బుధవారం రిలీజ్ చేసింది ఈ చిత్ర బృందం. ఎమోషనల్ ప్రేమ కధగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత, శర్వానంద్ తమ పాత్రలలో ఒదిగిపోయినట్టు కనిపిస్తున్నారు. నటనలో ఇద్దరు పోటీపడి చేసినట్టున్నారు.

“జానకి” గా సమంత, “రామ్” గా శర్వానంద్ నటించారు. “నన్ను వదిలేసి చాలా దూరం వెళ్లిపోయావా రామ్.. “అని సమంత అడగగా “నిన్ను ఎక్కడ వదిలేసానో.. అక్కడే ఉన్నానని” శర్వానంద్ చెప్పిన డైలాగ్ ఈ టీజర్ కె హైలైట్గా నిలిచింది. వీరిద్దరి మధ్యన కెమిస్టీ అదిరిపోయిందని అంటున్నారు చిత్ర యానిట్.

గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతాన్ని ఆడించాడు. తమిళంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సొంతం చేసుకుంది. తెలుగులో కూడా అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని చిత్రం యూనిట్ భావిస్తున్నారు.