దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకాల పంపిణీ మరింత వేగవంతం కానున్నది. ప్రస్తుతం ఉన్న టీకాలకు తోడు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. వచ్చే వారంలో జైకోవ్-డీ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోసం డీసీజీఐకి దరఖాస్తు చేయనున్నట్లు అహ్మదాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా తెలిపింది.

ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం లభిస్తే కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అనుమతి పొందిన డీఎన్‌ఏ టీకాగా నిలువనుంది. అలాగే దేశంలో అందుబాటులోకి వస్తే నాలుగో టీకా కానుంది.































