మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలోనూ నాలుకకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆహారాన్ని అటు, ఇటు కదల్చడంలోనూ, మింగడంలోనూ, మాటలు మాట్లాడడంలోనూ నాలుక ఉపయోగపడుతుంది. అయితే మీకెప్పుడైనా మీ నాలుకపై తెల్లని లేదా నల్లని, గోధుమ రంగు మచ్చలు కనిపించాయా..? నాలుక బాగా పగిలి కనిపించిందా..? అయితే చాలా మంది అదేదో విటమిన్ లోపమనో, రక్తహీనత అనో అనుకుంటారు. కానీ నాలుకపై ఏర్పడే ఆయా మచ్చలను, పగుళ్లు ఉన్న ప్రాంతాలను సరిగ్గా గమనిస్తే మీరు ఏయే అనారోగ్యాలతో బాధపడుతున్నారో తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా సరైన చికిత్స తీసుకుంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. నాలుక స్థితిని బట్టి ఎలాంటి అనారోగ్యం కలిగిందో తెలుసుకోవాలంటే కింద ఇచ్చింది చదవండి…
ఆరోగ్యవంతంగా ఉన్న వారి నాలుక పూర్తిగా పింక్ రంగులో ఉంటుంది. ఎలాంటి మచ్చలు, పగుళ్లు ఉండవు. కొంచెం తేమగా ఉంటుంది. మరీ ఎక్కువ తేమగా, మరీ పొడిగా మాత్రం ఉండదు.
చిత్రంలో చూపిన నాలుకను చూశారా..? నాలుకపై ఉన్న ఆయా ప్రాంతాలు మన శరీరంలోని పలు అవయవాలను ప్రతిబింబిస్తాయి. ఈ క్రమంలో నాలుకపై ఏ ప్రాంతంలో మచ్చలు, పగుళ్లు ఉంటాయో దాన్ని బట్టి సంబంధిత అవయవ సమస్యతో మనం బాధపడుతున్నట్టు లెక్క.
నాలుకపై చివరి భాగంలో తెల్లని లేదా నల్లని మచ్చలు ఉంటే మీరు జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుసుకోవాలి. లేదంటే పేగుల్లో పురుగులు, విష పదార్థాలు జామ్ అయ్యాయని అర్థం చేసుకోవాలి.
2. నాలుక చివరి భాగాల్లో మచ్చలు ఉంటే కిడ్నీ సంబంధ సమస్యలతో బాధ పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ మచ్చలు తెలుపు, డార్క్ బ్రౌన్ వంటి రంగుల్లో ఉంటాయి.
నాలుక మధ్య భాగంలో ఎర్రగా ఉండి చుట్టూ పొరలు పొరలుగా మచ్చలు ఉంటే రక్తంలో విష పదార్థాలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి.
నాలుక చివరి భాగాల్లో ఎరుపు రంగు మచ్చలు ఉంటే ఊపిరితిత్తులు, శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
నాలుక చివరి భాగాల్లో తెలుపు లేదా గోధుమ రంగు మచ్చలు గనక ఉన్నట్టయితే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
నాలుక చివరి భాగంలో పొరలు పొరలుగా మచ్చలు ఉండి నలుపు రంగులో ఉంటే న్యుమోనియాతో బాధపడుతున్నట్టు అర్థం చేసుకోవాలి.
దంతాలు పొరలుగా మారి నాలుకపై పడి కనిపిస్తుంటే జీర్ణక్రియ బాగా మందగించిందని తెలుసుకోవాలి. అంతేకాకుండా ఫుడ్ అలర్జీ, శరీరంలో విష పదార్థాలు ఎక్కువగా ఉన్నా అలా అవుతుంది.
నాలుక మధ్య భాగంలో తెల్లని మచ్చలు ఎక్కువగా ఉంటే పేగుల్లో విష పదార్థాలు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.
నాలుక బాగా పగుళ్లిచ్చి ఉంటే జీర్ణక్రియ బాగా లేదని అర్థం. భయం, నిద్రలేమి, ఆతురత, తొందరపాటు ఎక్కువగా ఉన్న వారి నాలుక అలా అవుతుంది.
నాలుక మధ్య భాగంలో చీలినట్టుగా గీత ఉంటే వెన్నెముక సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉన్నా నాలుక ఇలా అవుతుంది.
నాలుక కుడి భాగంలో అంచుల వైపు పొరలు పొరలుగా మచ్చలు ఉంటే ప్లీహం సమస్య ఉన్నట్టు తెలుసుకోవాలి.
నాలుక ఎడమ భాగంలో అంచుల వైపు పొరలు పొరలుగా మచ్చలు ఉంటే లివర్, ఫ్యాట్ సమస్యలు ఉన్నట్టు తెలుస్తుంది. డ్రగ్స్ ఎక్కువగా వాడినా నాలుక ఇలా అవుతుంది.
నాలుక సాధారణ సైజ్ కన్నా బాగా పెద్దగా ఉన్నట్టు కనిపిస్తే థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేదని అర్థం. శరీరంలో ద్రవాలు ఎక్కువగా ఉన్నా ఇలా నాలుక తయారవుతుంది.