మెగా కండిషన్స్ కి.. తలపట్టుకుంటున్న దర్శకుడు

0
372

“సైరా నరసింహారెడ్డి” తరువాత చిరంజీవి చేస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు కొరటాల శివ. ఈ మధ్యనే చిరంజీవి, త్రిష లపై ఒక పాటను షూటింగ్ చేస్తున్నారు. దేవాదాయశాఖ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన కలిగే చెడు ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఈ చిత్ర అసలు కథ. ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగిగా మెగాస్టార్ ఒదిగిపోనున్నారు.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సొంత ప్రొడక్షన్ కాబట్టి ఖర్చు విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారట చిరంజీవి. దుబారా కాకుండా పకడ్బందీగా చిత్రాన్ని తెరకెక్కించమని సూచించారట మెగాస్టార్. సినిమాలో అనవసర సీన్స్ లేకుండా ముందుగానే పేపర్ మీద ఎడిటింగ్ చేసుకుని సెట్స్ పైకి వెళ్తున్నారట. ఈ సినిమా ఎలాగైనా 90 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలనీ కొరటాల శివకి టార్గెట్ పెట్టాడట చిరంజీవి. దాని ప్రకారమే కొరటాల ప్లాన్ చేసుకుని షూటింగ్ చేస్తున్నారట. సైరా విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని, అనవసర సీన్స్ చాలా ఎడిటింగ్ లో తీసేయాల్సి వచ్చిందని, ఈ సినిమాకు అలా జరగకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారట చిరంజీవి. ఈ చిత్తానికి “గోవిందా హరి” మరియు “గోవిందాచార్య” అనే పేరును పరిశీలిస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here